ఆమె పేరు స్పందన. వయసు 35 ఏళ్లు. భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులే కావడంతో వీరి కాపురం కొన్నాళ్లపాటు సంతోషంగానే సాగింది. కానీ.., కొన్నాళ్ల నుంచి భర్త మద్యానికి బానిసై భార్యను తీవ్రంగా హింసించాడు. భర్త వేధింపులు శ్రుతి మించడంతో భార్య తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. నగరంలోని బాచుపల్లి నిజాంపేట్ లో ప్రసాద్, స్పందన భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు జన్మించాడు. అయితే రోజులు గడిచే కొద్ది భర్త మద్యానికి అలవాటు పడి భార్యను తీవ్ర హింసకు గురి చేసేవాడు. కొన్నాళ్ల పాటు స్పందన భర్త దారుణాలను చూస్తూ సైలెంట్ గానే ఉండిపోయింది. కానీ ప్రసాద్ వేధింపులు శ్రుతి మించడంతో తట్టుకోలేకపోయింది. ఏం చేయాలో తెలియక స్పందన ఇటీవల భర్త లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న స్పందన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. భర్త వేధింపులను భరించలేకే స్పందన ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఈ ఘటనపై వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూాడా చదవండి: పని మీద బయటకెళ్లిన భర్త.. మిడ్ నైట్ కోడలి బెడ్ రూంలోకి దూరిన మామ!