వారిద్దరికి ఫేస్ బుక్ లో పరిచయం. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకి ప్రేమగా మారింది. ఇక ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. తల్లిదండ్రులను ఎదురించి మరీ ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారిద్దరిని పిలిచి కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. కట్ చేస్తే మైనర్ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడి వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చి వెళ్లిపోయారు. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాంత్ అనే యువకుడికి గత కొంత కాలం క్రితం ఫేస్ బుక్ లో ఓ అమ్మాయి పేరుతో ఫ్రెండ్ రిక్వస్ట్ వచ్చింది. దీంతో మనోడు ఆక్సెప్ట్ చేసి ఆమెతో చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. దీంతో ఒకరికొకరు పరిచయం పెంచుకున్నారు. ఈ పరిచయమే చివరికి ప్రేమగా మారింది. దీంతో కొన్ని రోజుల పాటు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. ఇలా కాదని భావించి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ వారి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయినా సరే తల్లిదండ్రులను ఎదురించి మరీ ఇంట్లో నుంచి వెళ్లిపోయి జూన్ 4న పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో నవ దంపతులతో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. అనంతరం యువతి కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని ఆ యువకుడి నుంచి ఇంటికి తీసుకెళ్లారు. ఇక కొన్ని రోజుల తర్వాత వీరిద్దరూ మళ్లీ కలుసుకోవాలనే ప్రయత్నం చేసినా చివరికి అది జరగలేదు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఆ యువతి ఈ నెల 15న ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియురాలు లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన శ్రీకాంత్ అమ్ముగూడ రైల్వే ట్రాక్ పై బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఇలా పెళ్లైన కొన్నాళ్లకే ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విషాదంగా ముసిగిన ఈ ఫేస్ బుక్ ప్రేమపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: డిగ్రీ చదువుతున్న అనూష.. ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి!