ఢిల్లీలోని ఓ తాగుబోతు లేడీస్ హాస్టల్ లోకి చొరబడ్డాడు. ఏకంగా అమ్మాయిల రూమ్ లోకి వెళ్లి పాడుపనికి శ్రీకారం చుట్టాడు. అంతటితో ఆగకుండా చెప్పరాని విధంగా వికృత చేష్టలకు కాలుదువ్వాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల వీడియో ప్రస్తుతం నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ కరోల్ బాగ్ ప్రాంతంలో ఓ లేడీ హాస్టల్ ఉంది. అందులో ఎంతో మంది అమ్మాయిలు నివాసం ఉంటూ చదువుకుంటున్నారు. అయితే ఎప్పటి నుంచో ఓ సెక్యూరిటీ గార్డ్ అందులో ఉన్న కొందరి అమ్మాయిలపై కన్నేశాడు. ఇందులో భాగంగానే ఇటీవల ఆ సెక్యూరిటీ గార్డ్ తప్పతాగి వారున్న హాస్టల్ లోకి ఎవరూ లేని టైమ్ లో ప్రవేశించాడు. గుట్టుచప్పుడు కాకుండా వారుంటున్న రూమ్ లోకి వెళ్లాడు. అయితే బయట నుంచి రూమ్ లోకి వెళ్లిన కొందరు అమ్మాయిలు రూమ్ లో ఎవరో అబ్బాయి ఉన్నట్లు చూసి ఒక్కసారిగా అరుపులతో బయటకు పరుగులు తీశారు. తీరా ఓ అమ్మాయిని పట్టుకున్న ఆ తాగుబోతు తాకరాని చోట తాకి పాడుపనికి శ్రీకారం చుట్టాడు. అసభ్యకరంగా ప్రవర్తించి ఆ అమ్మాయిపై దాడికి పాల్పడి అనంతరం పరుగో పరుగు అంటూ అక్కడ నుంచి జారుకున్నాడు. ఇదే దృశ్యాలు హాస్టల్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వెంటనే స్పందించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని యువతులు ఆరోపిస్తున్నారు. ఇదే వీడియో మెల్ల మెల్లగా సోషల్ మీడియాలో వైరల్ గా మారి చివరికి ఉమెన్ కమిషన్ చైర్ పర్సన్ వద్దకు చేరుకుంది. దీంతో రంగంలోకి దిగిన ఆమె వెంటనే ఢిల్లీ పోలీసులకు నోటీసులకు జారీ చేసింది. ఆమె ఫిర్యాదుతో అలెర్ట్ అయిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది. తప్పతాగి లేడీస్ హాస్టల్ లోకి దూసుకెళ్లి అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సెక్యూరిటీ గార్డ్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. करोल बाग में चल रहे एक PG hostel में सिक्योरिटी गार्ड ने नशे की हालत में लड़कियों के साथ छेड़खानी और मारपीट की. हमें ट्विटर के जरिए शिकायत मिली, मामले की गंभीरता को देखते हुए पुलिस को नोटिस जारी किया है. मामले में कड़ी कार्यवाही सुनिश्चित करेंगे। pic.twitter.com/6smwjfqEJB — Swati Maliwal (@SwatiJaiHind) August 16, 2022 ఇది కూడా చదవండి: రూ.500 కోసం తల నరికిన యువకుడు!