నేటి కాలం యువత క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రేమించిన వాడు దక్కలేదని, ప్రియుడు మోసం చేశాడని.., ఇలా కారణాలు వేరైన చివరికి బలనవ్మరణమే మార్గమనుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే ఆలోచించిన ఓ యువతి ప్రేమించిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో తట్టుకోలేక తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా ఈ విషాద ఘటన చెన్నైలో వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే? తిరునల్వేలి జిల్లా నాంగునేరికి చెందిన సుధా (22) అనే యువతి వరసకు బావయ్యే మేనమామ కొడుకు సుబ్బయ్య(24)ను ప్రేమించింది. ఇద్దరు కొంత కాలం పాటు కలిసి తిరిగారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే ఇటీవల వీరి ప్రేమ వ్యవహారం సుధా ఇంట్లో తెలిసి వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. చదువుకునే వయసులో ప్రేమ ఏంటని మందలించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సుబ్బయ్య తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. బావ మరణాన్ని తట్టుకోలేని సుధా.., ప్రేమించిన వాడు లేని ఈ లోకంలో నేనేలా ఉండేదని ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఒకే రోజు ఇద్దరు మరణించడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. జీవితంలో కలిసి ఒక్కటి కాకున్నా.., మరణంలోనైన ఒక్కటవ్వాలనుకున్నారు. బావ, మరదలు ఆత్మహత్య చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్? అసలు వీరి ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడమే వీరి మరణానికి కారణమా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ప్రియురాలిని కాదని మరో యువతితో వివాహం.. పెళ్లి పీటల మీదే చుక్కలు చూపించిన యువతి!