ఈ మద్య దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా అత్యాచారాలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆడది కనిపిస్తే చాలు వయసు తో సంబంధం లేకుండా మృగాళ్లలా రెచ్చిపోతున్నారు కామంధులు. ఏడాది పాప నుంచి ఎనభై ఏళ్ల వృద్దులను కూడా వదలడం లేదు. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దారుణం జరిగింది. కామంతో కళ్ళుమూసుకుపోయిన ఒక కమెడియన్ 6 ఏళ్ల చిన్నారి కి చాక్లెట్ ఆశ చూపించి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన ప్రస్తుతం కోలీవుడ్ లో సంచలనం గా మారింది. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ లో ఇండస్ట్రీలో ఏబి రాజు కమెడియన్ గా పలు చిత్రాల్లో నటించాడు. గత కొంత కాలంగా ఏబీ రాజు చెన్నైలోని ఒక అపార్ట్మెంట్ లో నివసిస్తున్నాడు. ఈ అపార్ట్మెంట్ లోనే కింద ప్లాట్ లో మరో కుటుంబం నివసిస్తున్నారు.. వారికి ఆరేళ్ల పాప ఉంది. ఆ పాప ప్రస్తుతం రెండో తరగతి చదువుతుంది. చిన్నారి ఖాళీ దొరికినప్పుడల్లా రాజు ఇంటికి వెళ్లి ఆడుకొంటూ ఉంటుంది. ఈ క్రమంలో గత 14వ తేదీ రాత్రి 8 గంటలకు చిన్నారి ఏబీ రాజు ఇంటికి వెళ్లింది. ఒంటరిగా ఉన్న చిన్నారిని చూసి ఏబీ రాజు కామంతో రెచ్చిపోయాడు.. బాలికకు చాక్లెట్లు ఇచ్చి అసభ్యంగా ప్రవర్తించి ఆమె ప్రైవేట్ భాగాలను తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చిన్నారి గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది.. దాంతో ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. బాలిక నీరసంగా కనబడటంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు చెన్నై పోలీస్ స్టేషన్ లో రాజుపై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏబీ రాజును అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది చదవండి: వీడియో: బరితెగించిన దొంగలు! నడిరోడ్డుపై మహిళ బ్యాగ్ ను ఎత్తుకెళ్ళి.. ఇది చదవండి: లేడీస్ హాస్టల్‌లోకి చొరబడ్డ తాగుబోతు.. ఏం చేశాడో మీరే చూడండి!