బీజేపీ నేత, బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనాలి ఫోగట్ ఇటీవల గోవాలో ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె గుండెపోటుతో మరణించిందని ఇటీవల వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే సోనాలి ఫోగట్ మరణంపై ఆమె సోదరి రమణ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టింది. ఆమె గుండె పోటుతో మరణించలేదని, మాకు ఎందుకో అనుమానాలు కలుగుతున్నాయని వాపోయింది. సోనాలి చనిపోయే ముందు నాకు ఫోన్ చేసి మా అమ్మతో మాట్లాడిందని తెలిపింది. భోజనం చేశాక.., నాకు ఏదో జరుగుతుందని, ఎందుకో నాకు అర్థం కావడం లేదని తెలిపిందని రమణ్ అన్నారు. ముందుగా నార్మల్ కాల్ మాట్లాడిన ఆమె, తర్వాత వాట్సాప్ కాల్ చేసి కొద్దిసేపు మాట్లాడిందని ఆమె సోదరి రమణ్ వాపోయింది. కానీ ఇంత వరకు ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఎంతో ఫిట్ గా ఉంటుందని, అసలు గుండె పోటుతో మరణించిందంటే మా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా నమ్మలేకపోతున్నారని రమణ్ తెలిపింది. ఇక ఇప్పటికీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు. దీంతోనే మాకు ఎందుకో అనుమానాలు కలుగుతుండడంతో గోవా, హర్యానా ప్రభుత్వాలకు సోనాలి మరణంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశామని ఆమె తెలిపింది. గోవా వైద్యులు సైతం సోనాలి ఫోగట్ గుండె పోటుతోనే మరణించిందని ద్రువీకరించడం విశేషం. ఇక ఏదేమైన సోనాలి మరణంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తుండడంతో ఆమె గుండెపోటుతోనే మరణించిందా? లేక మరేదైన కారణం ఉందా అనే అనుమానాలు సైతం కలుగుతున్నాయి. 42 ఏళ్ల సోనాలి ఫోగట్ హర్యానా చిత్ర రంగంలో ఎన్నో చిత్రాల్లో నటించింది. అనంతరం ఆమె బిగ్ బాస్ 14 లో కంటెస్టెంట్ గా కూడా రాణించి బాగా ఫేమస్ అయింది. దీంతో మొన్నటి వరకు ఆమె హర్యానా బీజేపీలో రాజకీయ నాయకురాలిగా కూడా కొనసాగింది. సోనాలి ఫోగట్ మరణంపై ఆమె కుటుంబ సభ్యుల అనుమానాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: తాను కోరుకున్న సుఖమే దక్కలేదు.. భర్త వేధింపులు హద్దులు దాటి!