క్యాబ్ సేవల సంస్థలు ఓలా, ఉబర్ విలీనవుతున్నాయంటూ వచ్చిన వార్తలు బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సంస్థలు విలీనం గురించి చర్చలు ప్రారంభించాయంటూ, ఓ ఆంగ్ల దిన పత్రిక సైతం ఒక వార్తాకథనం ప్రచురించింది. ఈ వ్యాఖ్యలను ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తీవ్రంగా ఖండించారు. ఉబర్‌తో విలీనం దిశగా చర్చలు జరుపుతున్నట్లు వచ్చిన వార్తలపై ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ స్పందించారు. 'అదంతా చెత్త. మేం చాలా లాభాల్లో ఉన్నాం. ఎదుగుతున్నాం. ఒకవేళ ఇతర కంపెనీలు భారత్‌లో లావాదేవీల నుంచి వైదొలిగితే, మేం వారిని స్వాగతిస్తాం. కానీ మేం విలీనం కాబోము' అని ట్వీట్ చేశారు. Absolute rubbish. We’re very profitable and growing well. If some other companies want to exit their business from India they are welcome to! We will never merge. https://t.co/X3wC9HDrnr — Bhavish Aggarwal (@bhash) July 29, 2022 భారత్‌లో క్యాబ్ సర్వీసుల మార్కెట్‌పై పట్టు కోసం ఉబెర్, ఓలా పరస్పరం పోటీ పడుతున్నాయి. డ్రైవర్లకు భారీగా ఇన్సెంటివ్‌లు, ప్యాసింజర్లకు డిస్కౌంట్లు ఇచ్చాయి. కానీ, కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇదిలా ఉంటే ఉబెర్.. భారత్‌లో తన ఫుడ్ డెలివరీ బిజినెస్ ఉబెర్ ఈట్స్‌ను 2020 జనవరిలో జొమాటోకు విక్రయించింది. గ్రాసరీ డెలివరీ బిజినెస్‌లో నిధులు పెట్టిన ఓలా దాన్ని మూసేసి, తదుపరి ఎలక్ట్రిక్ వెహికల్ వెంచర్.. ఓలా ఎలక్ట్రిక్‌లో పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలోనే ఈ వార్తలొచ్చాయి. ఇక.. ఈ విషయంపై నెటిజన్స్ కూడా తమదైన శైలిలో స్పందించారు. "Uber + Ola = Ubla" అనే నామకరణం కూడా సిద్ధం చేశారు. ఈ వార్త, పుకార్లే అయినప్పటికీ.. బిజినెస్ వర్గాల్లో మాత్రం తీవ్ర కలకలం రేపింది. Though the marriage between Ola & Uber is not in the offing now, What might have been their new brand's name? I'll go first 1. Oler 2. Olub 3. Ubol 4. Ubla 5. Erol 6. Erla pic.twitter.com/1fqrMn8WAq — Vignesh V (@vickydeinsty) July 30, 2022 ఇదీ చదవండి: భారత్ లో అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓ.. ఏడాదికి రూ.123 కోట్లా? ఇదీ చదవండి: ఓటీటీ మార్కెట్లో టాప్ ఎవరు? డిస్నీ+హాట్‌స్టార్‌ని ఢీకొట్టే ఓటీటీ ఏది?