ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ).. ఇది అందరకి సుపరిచితమే. తమ వద్ద ఉన్న కొంత మిగులు సొమ్మును బ్యాంకుల్లో పెట్టుబడి రూపంలో దాచి.. దానిపై వడ్డీని పొందడం. అయితే.. ఎఫ్‌డీలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు వివిధ రకాలుగా అందిస్తుంటాయి. ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టడం చాలా సేఫ్. అందుకే.. సీనియర్ సిటిజన్లు, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు వీటిని ఎంచుకుంటారు. అయితే.. వీటిల్లో అధిక వడ్డీ రావాలని ఆశపడటం సహజం. అలాంటి.. ఎక్కువ వడ్డీని అందిస్తున్న బ్యాంకుల వివరాలు మీకోసం.. ఆర్బీఐ రెపో రేటు పెంచడంతో కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇటివల వడ్డీ రేట్లను పెంచాయి. ఆ బ్యాంకులేవో, వడ్డీని ఎంత శాతం అందిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం.. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 7.5 శాతం (ఎఫ్‌డీ కాలపరిమితి 1000 రోజులు) ఉజ్జయిన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 7.5 శాతం (525, 990 రోజులు సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 7.49 శాతం (999 రోజులు) జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 7.35 (3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల మధ్య) ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 7.32 శాతం (888 రోజులు) డచ్ బ్యాంక్(విదేశీ బ్యాంకు) - 7 శాతం(టెన్యూర్ 3 - 4 ఏళ్ల మధ్య) బంధన్ బ్యాంక్ (ప్రైవేటు బ్యాంకు) - 7 శాతం (ఏడాది నుంచి 5 ఏళ్ల కాలపరిమితి) ఆర్‌బీఎల్ బ్యాంక్ (ప్రైవేటు బ్యాంకు) - 7 శాతం (ఏడాది నుంచి 5 ఏళ్ల కాలపరిమితి) ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (ప్రైవేటు బ్యాంకు) - 6.9 శాతం (750 రోజులు) గమనిక: పైన పేర్కొన్న వడ్డీ రేట్లు పొందాలంటే.. కనీస మొత్తం లక్షకు పైగా ఉండాలి. అలాగే.. వడ్డీ రేట్లు సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. గమనించగలరు. ఇదీ చదవండి: పొరపాటున UPI ద్వారా తప్పుడు ఖాతాకు డబ్బు పంపారా.. ఇలా చేస్తే, మీ మనీ రిటర్న్! ఇదీ చదవండి: Pension Scheme: నెలకు రూ. 55 చెల్లిస్తే.. ఏడాదికి రూ. 36 వేల పెన్షన్.. ఎలాగో తెలుసా?