దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా చెలామణి అవుతున్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఛైర్మన్ దినేష్ ఖారా 2021-22 ఆర్థిక సంవత్సరంలో వార్షిక వేతనం కింద రూ.34.42 లక్షలను అందుకున్నట్టు ఎస్బీఐ తన వార్షిక నివేదికలో తెలిపింది. ఈయనకంటే ముందు ఛైర్మన్‌గా పనిచేసే రజ్‌నీష్ కుమార్ కంటే 13.4 శాతం అత్యధికంగా వేతనాన్ని దినేష్ ఖారా అందుకున్నట్టు ఈ రిపోర్టులో పేర్కొంది. ఖారా 2020 అక్టోబర్‌లో ఎస్‌బీఐ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఖారా ఛైర్మన్ కాకముందు.. గ్లోబల్ బ్యాంకింగ్‌కు, ఎస్‌బీఐ సబ్సిడరీలకు ఇన్‌ఛార్జ్‌గా, బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దినేశ్ ఖారా.. రూ.27 లక్షల కనీస వేతనం పొందితే రూ.7,42,500 కరువు భత్యం (డీఏ)తోపాటు ఇన్సెంటివ్‌ల రూపంలో మరో రూ.4 లక్షలు అందుకున్నారు. గత ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ తీసుకెళ్లిన వార్షిక వేతనం రూ.30.35 లక్షలు. 2020 అక్టోబర్‌లో రిటైర్మెంట్ సమయంలో రూ.14.04 లక్షలు లీవ్ ఎన్‌కాష్‌మెంట్ డబ్బు తీసుకున్నారు. Shri Dinesh Kumar Khara, Chairman - @TheOfficialSBI, hands over a dividend cheque of Rs 3606.40 crore for FY 2021-22 to Smt @nsitharaman. Shri Sanjay Malhotra, Secretary - @DFS_India, and senior officials of SBI are also present on the occasion. pic.twitter.com/7npw7hkVsu — NSitharamanOffice (@nsitharamanoffc) June 6, 2022 ఇక.. గత ఆర్థిక సంవత్సరంలో కెనరా బ్యాంక్ ఎండీ కం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఎల్వీ ప్రభాకర్ రూ.36.89 లక్షల వేతనం అందుకోగా.. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఎండీ కం సీఈవో సంజీవ్ చద్దా వార్షిక వేతనం రూ.40.46 లక్షలు అందుకున్నారు. ఇది కూడా చదవండి: కరెన్సీ నోట్లపై గాంధీ ఫోటో మార్పు! క్లారిటీ ఇచ్చిన RBI.. ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈవో కం ఎండీల వేతనంతో పోలిస్తే, ప్రైవేట్ బ్యాంకుల సీఈవోల వేతనాలు పలు రెట్లు ఎక్కువ. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుగా చెలామనీ అవుతున్న హెచ్డీఎఫ్‌సీ ఎండీ కం సీఈవో శశిధర్ జగదీశన్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.4.77 కోట్ల వేతనం అందుకోగా.. మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ అధినేత అమితాబ్ చౌదరి వేతనం రూ.6.52 కోట్లు అందుకున్నారు. అయితే.. 2020-21 కొవిడ్-19 సంక్షోభం వేళ అమితాబ్ చౌదరి వేతనం లేకుండానే పని చేయడం గమనార్హం.