రిలయన్స్ జియో తన 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఓ రీచార్జ్ ప్లాన్‌పై ఆరు కూపన్స్‌ను ఫ్రీగా అందిస్తోంది. అందులో 75జీబీ డేటా ఉచిత కూపన్ కూడా ఉంది. ఆ వివరాలు.. 2016 సెప్టెంబర్‌లో లాంచ్ అయిన జియో 4జీ నెట్‌వర్క్.. మొదట ఆరు నెలలు పాటు అన్ని సేవలు ఉచితమంటూ కస్టమర్లను విపరీతంగా ఆకర్షించింది. ఆ దెబ్బతో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించింది. ఈ నెలలతో జియో అరంగ్రేటానికి ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ సందర్బంగా ఒక ప్లాన్ పై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. జియో 6వ వార్షికోత్సవ ఆఫర్ వార్షికోత్సవ ఆఫర్ లో భాగంగా జియో రూ.2,999 ప్లాన్‌పై ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే ఏకంగా ఆరు కూపన్స్ ఉచితంగా లభిస్తాయి. అలాగే.. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఏడాదిపాటు ఉచితంగా లభిస్తుంది. రూ.2,999 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. ప్రతీ రోజు 2.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే.. ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. వీటితో పాటు అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. అదనపు ప్రయోజనాలు: 75జీబీ డేటా కూపన్ ఉచితం జియోకు చెందిన షాపింగ్ సైట్ ఆజియోకు చెందిన రూ.750 విలువైన కూపన్. రిలయన్స్ డిజిటల్‌లో రూ.5,000 కొనుగోలుపై రూ.500 తగ్గింపు పొందేలా కూపన్. జియో సావన్ ప్రో ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్‌పై 50శాతం తగ్గింపు పొందేలా కూపన్. ట్రావెల్ పోర్టల్ ఇక్సిగోకు చెందిన రూ.750 విలువైన డిస్కౌంట్ కూపన్. నెట్‌మెడ్స్‌లో రూ.1000 కొనుగోలుపై 25శాతం డిస్కౌంట్ లభించేలా కూపన్. ఇలా ఒక్క రీచార్జ్‌తో పలు కూపన్స్ ఫ్రీగా లభిస్తాయి. ఈ ఆఫర్ ఎప్పటివరకు అందుబాటులో ఉంటుంది అన్నది తెలియరాలేదు. ఈ ఆఫర్ పై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. 6 BIG benefits on 6 years of Jio, with ₹2999 plan. Recharge now: https://t.co/BhYBHZwt3H@RelianceDigital @AJIOLife @NetMeds @JioSaavn @ixigo #6YearsOfJio #JioTogether #WithLoveFromJio pic.twitter.com/tYM8Im3q5y — Reliance Jio (@reliancejio) September 5, 2022 ఇదీ చదవండి: Airtel vs Jio: బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్ కోసం ఏది బెస్ట్! ఇదీ చదవండి: భవిష్యత్ గురుంచి ఆలోచించండి.. కేవలం రూ. 299 ప్రీమియంతో రూ. 10 లక్షల బీమా పొందొచ్చు!