రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముఖేశ్ అంబానీ తరచూ వార్తల్లో నిలుస్తుండే విషయం తెలిసిందే. వందల కోట్ల బిజినెస్, కోట్లలో లాభాలు అందుకునే సంస్థ రిలయన్స్. అయితే ఆ సంస్థకు ఛైర్మన్, ఎండీగా ముఖేశ్ అంబానీ ఎంత జీతం తీసుకుంటారు అనేది మాత్రం చాలా మందికి తెలియదు. అన్ని వందల కోట్ల వ్యాపారం కదా జీతం కూడా అంతే ఉంటుందని అంతా భావిస్తుంటారు. అయితే కరోనా సమయంలో మాత్రం 2020-21 సంవత్సరానికి తాను వేతనం తీసుకోవడం లేదంటూ ప్రకటించారు. కరోనా కారణంగా ఆర్థికంగా, పారిశ్రామికంగా దేశం అతలాకుతలమౌతోందంటూ అప్పుడు జీతాన్ని వదులుకున్నారు. ఇప్పుడు 2021-22కి కూడా జీతం తీసుకోలేదని వార్తలు వచ్చాయి. 2020 మార్చి నుంచి 2022 మార్చి వరకు ముఖేశ్ అంబానీ జీతం తీసుకోలేదు. ప్రస్తుతం కొన్ని నివేదికలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటి ప్రకారం ముఖేశ్ అంబానీ రెండేళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదని తెలిసింది. జీతం వదులుకోవడం కారణంగా.. ముఖేశ్ అంబానీకి రెండేళ్ల పాటు ఏలాంటి అలవెన్సులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, కమీషన్, స్టాక్స్ ఆప్షన్స్, సోషల్ సెక్యూరిటీ, రిటైర్మెంట్ ప్రయోజనాలు దక్కలేదు. అయితే 2018-19 వరకు ఎంత జీతం తీసుకున్నాడు అనేది కూడా వెలుగులోకి వచ్చింది. 2018-19 సంవత్సరంలో ముఖేశ్ అంబానీ ఏడాదికి రూ.15 కోట్లు జీతంగా తీసుకున్నారు. అయితే 2008-09 నుంచి గత 11 ఏళ్లుగా ఆయన ఏడాదికి రూ.15 కోట్లే జీతంగా తీసుకున్నారని తెలుస్తోంది. ముఖేశ్ అంబానీ ఏడాది జీతంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Mukesh Ambani for the second year in a row drew no salary from his flagship firm Reliance Industries in the last fiscal...#MarketingMind #WhatsBuzzing #RelianceIndustries pic.twitter.com/ecNeNHsFTi — Marketing Mind (@MarketingMind_) August 8, 2022 ఇదీ చదవండి: HDFC కస్టమర్లకు చేదు వార్త.. ఇక నుంచి EMIలు మరింత భారం! ఇదీ చదవండి: IRCTC జాబ్: ఇంట్లో కూర్చొని నెలకి రూ.80 వేల సంపాదించవచ్చు!