భవిష్యత్ లో పిల్లల జీవితం ఆనందంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అలా అన్ని సవ్యంగా జరగాలంటే చిన్న వయసులోనే పిల్లల పేరుపై పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనివల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. అంతేకాదు.. ఈ పెట్టుబడి వారి విద్యకు, వివాహానికి అన్నింటికీ భరోసాగా ఉంటుంది. అయితే ఏ పొదుపు పథకాలలో పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందో తెలుసుకుందాం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). పీపీఎఫ్ లో ఖాతా తెరిచి నెల నెలా కొంత మొత్తంలో పొదుపుచేస్తూ పోతే.. 15 సంవత్సరాలలో 32 లక్షలు పొందే అవకాశం ఉంది. పిల్లల పేరు మీద ఉన్న పీపీఎఫ్ ఖాతా నుంచి రూ.32 లక్షలు ఎలా పొందాలో తెలుసుకుందాం. మీ పిల్లల వయస్సు 3 సంవత్సరాలప్పుడు మీరు పీపీఎఫ్ ఖాతా తెరిచి ప్రతి నెలా రూ. 10,000 పొదుపు చేయడం ప్రారంభించారని అనుకుందాం. 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. పిల్లలకి 18 ఏళ్లు వచ్చేసరికి పీపీఎఫ్ ఖాతా మెచ్యూర్ అవుతుంది. పొదుపుపై ఇంట్రెస్ట్ రేట్ ను 7.10 శాతం అనుకుంటే.. మెచ్యూరిటీ సమయానికి పిల్లలకు రూ. 3,216,241 లభిస్తుంది. 15 సంవత్సరాలకు మీ పొదుపు 18 లక్షలు 12 నెలలు * 10,000 = 1,20,000 1,20,000 * 15 = 18,00,000 రాబడి(అంచనా).. రూ. 3,216,241 పీపీఎఫ్ ఖాతా ఎలా తెరవాలి? దీనికి ఏ డాక్యుమెంట్లు అవసరమో తెలుసుకుందాం. పీపీఎఫ్ ఖాతాను ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో తెరవొచ్చు. ఆన్ లైన్ లో ఖాతా తెరవాలనుకుంటున్నవారు ఎంపిక చేసుకున్న బ్యాంకు లేదా పోస్టాఫీసు వెబ్ సైట్ ద్వారా ఖాతాను తెరవొచ్చు. ఆఫ్ లైన్ లో ఖాతా తెరవాలనుకుంటే దగ్గర్లోని పోస్టాఫీసు లేదా ఎంపిక చేసుకున్న బ్యాంకుకు వెళ్లి ఖాతాను తెరవచ్చు. ఇంటికి సమీపంలో ఏదైనా బ్రాంచ్ ఉంటే అక్కడ పీపీఎఫ్ ఖాతాను తెరవడం మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో దీన్ని నిర్వహించడం సులభం అవుతుంది. పీపీఎఫ్ ఖాతాను అన్ని బ్యాంకులూ అందించవు. నేషలైజ్డ్ బ్యాంకులు, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి కొన్ని బ్యాంకులు మాత్రమే అందిస్తున్నాయి. ఖాతా తెరించేందుకు కావలసిన డాక్యుమెంట్లు కేవైసీ పత్రాల వెరిఫికేషన్ కోసం వ్యక్తి గుర్తింపు పత్రం (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, విద్యుత్ బిల్లు, వాటర్ బిల్లు) నివాస చిరునామా ప్రూప్ పాన్ కార్డ్ ఖాతా తెరిచేవారి పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఈ పొదుపు ఖాతాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.