తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ విధానం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తోన్నాయి. ప్యాకేజీ ఫుడ్స్, ఆసుపత్రి బెడ్స్ పై 5 శాతం జీఎస్టీ విధించారు. దీంతో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై అలాగే మోదీపై విమర్శల గుప్పించాయి. వినియోగదారుల నుంచి కూడా వ్యతిరేకత రాగా.. ఈ నేపధ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ కీలక ప్రకటన చేశారు. ఇప్పుడు ఆ ప్రకటనకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం పదండి. గత నెలలో జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్యాకేజీ ఫుడ్స్, ఆసుపత్రి బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీని విధించారు. దీంతో ఒక్కసారిగా ప్రతిపక్షాలతో పాటు సామాన్య జనం సైతం కంగుతిన్నారు. 5 శాతం జీఎస్టీ పెంచడం వల్ల వినియోగదారులపై భారం పడుతుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. తాజాగా దీనిపై గందరగోళం ఏర్పడడంతో నిర్మలా సీతారామన్ ఓ కీలక ప్రకటన ట్విట్టర్ ద్వారా విడుదలచేసి జీఎస్టీ పై ఓ క్లారిటీ ఇచ్చారు. పోస్ట్ లో ఈ విధంగా స్పందించారు. "ముఖ్యంగా ఓట్స్, మొక్కజొన్న, బియ్యం, పప్పు, బియ్యం, రవ్వ, సెనగపిండి, పెరుగు, లస్సీ, మరమరాలు వంటి నిత్యావసర వస్తువులను బ్రాండెడ్‌గా, ప్యాక్ చేసి విక్రయిస్తే మాత్రమే పన్ను ఉంటుందని ఆమె వివరణ ఇచ్చారు. ఇవే ఉత్పత్తులను విడిగా, ప్యాక్ చేయకుండా అంటే పొట్లం కట్టి విక్రయిస్తే జీఎస్టీ వర్తించదని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. లూజ్‌గా లేదా, బహిరంగ విక్రయాలపై జీఎస్టీ వర్తించదు అంటూ 14 వస్తువుల జాబితాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ట్వీట్ చేశారు. లేబుల్ లేని లేదా ప్యాక్ చేయని, విడిగా అమ్మే వస్తువులపై జీఎస్టీ ఉండదని ఆమె మరో మారు గుర్తు చేశారు. గత సమావేశంలో తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయం ప్రకారమే పన్నుపెంపు చేశామని సమర్థించుకున్నారు. తాజాగా ఆర్థిక మంత్రి తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. #GST @FinMinIndia @PIB_India @PIBMumbai @PIBChandigarh @PIBHyderabad @pibchennai @PIBKolkata @PIBKohima @PIBGuwahati @PIBHindi @cbic_india https://t.co/EDWfuYnGzC — Nirmala Sitharaman (@nsitharaman) July 19, 2022 ఇదీ చదవండి: వీడియో: అందరూ చూస్తుండగా రోడ్డు కృంగిపోయింది! ఇదీ చదవండి: జన్మ జన్మల అనుబంధం.. చావు కూడ విడదీయలేకపోయింది!