ఇది కరోనా సమయం. చాలా మంది తమ ఆరోగ్య కారణాల దృష్టా ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడుతుంటారు. అయితే.., ఇలా ఇంట్లోనే ఉండిపోతే ఆదాయ మార్గం ఎలా అనేది మరో ప్రశ్న. ఇలాంటి వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ బాగా కలసి వచ్చింది. కానీ.., ఇది అందరికీ అందే అవకాశం కాదు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు మాత్రమే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాయి. మరి.. మిగతా వారి పరిస్థితి ఏంటి? ఇలాంటి వారికి ఇప్పుడు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది... ఇంట్లో ఉండి నెలకు రూ.80 వేలు సంపాదించాలని మీకు ఉంటే. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లో బుకింగ్ ఏజెంట్ గా చేరితే చాలు. మీ ఫేట్ మారిపోయినట్టే. IRCTC రైల్వే ప్రయాణికులకు ఆన్లైన్ బుకింగ్ టిక్కెట్లు, క్యాటరింగ్ సర్వీసులను అందిస్తుంది. ఇండియన్ రైల్వే టికెట్లలో అధిక టికెట్స్ ఈ సంస్థ ద్వారానే బుక్ అవుతున్నాయి. మరి.. దీనిలో ఏజెంట్ గా మారుతే ఎలా ఆదాయం వస్తుందో ఇప్పుడు చూద్దాం. IRCTCలో ఆతరైస్డ్ బుకింగ్ ఏజెంట్ గా చేరితే.. మీరే ప్యాసింజర్లకి టికెట్స్ బుక్ చేయవచ్చు. నాన్ ఏసీ క్లాసులో PNR టికెట్ బుక్ చేస్తే రూ.20, ఏసీ క్లాసులో అయితే.. రూ.40 సంపాదించవచ్చు. ఇవిగాక.., రూ.2 వేలకు పైగా జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక్క శాతం అమౌంట్ మీ ఖాతాలో పడుతుంది. ఇక్కడ IRCTC ఏజెంట్ గా మీరు ఇన్నఇన్నే టికెట్స్ బుక్ చేయాలన్న నిబంధన లేదు. మీ బిజినెస్ జరిగే స్థాయిని బట్టి నెలలో మీరు ఎన్ని టికెట్స్ అయినా బుక్ చేయవచ్చు. ప్రతి బుకింగ్ ఏజెంట్ గా మీకు కమీషన్ ఉంటుంది. ఇలా మీరు గనుక కష్టపడితే నెలకు 60 నుండి రూ.80 వేల రూపాయల మధ్యలో ఆదాయం ఉంటుంది. మరి IRCTC ఏజెంట్ అవ్వడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం IRCTC వెబ్ సైట్ లో ఏజెంట్ ఫామ్ నింపండి. తర్వాత సంబంధిత డాక్యుమెంట్లను యాడ్ చేసి, డిక్లరేషన్ ఫామ్ ను సైన్ చేసి వాటిని స్కాన్ చేయాలి. ఆ తరువాత ఒక సంవత్సరం బుకింగ్ ఏజెంట్ గా పని చేయడానికి రూ.3,999, రెండు సంవత్సరాలకి అయితే.. రూ.6,999 డిపాజిట్ రుసుము చెల్లించాలి. ఈ ప్రాసెస్ అంతా పూర్తి అయ్యాక.. IRCTC ఐడీ క్రియేట్ అవుతుంది. తరువాత ఓటీపీ, వీడియో వెరిఫికేషన్ కూడా పూర్తి అవుతాయి. ఇక చివరగా ఏజెంట్ వివరాలు మీ మెయిల్ ఐడీకి పంపబడతాయి. ఇలా కనుక మీరు IRCTC ఏజెంట్ అయితే.. ఇంట్లో కూర్చునే మీ అవసరాలకి సరిపడా మంచి ఆదాయం పొందవచ్చు. మరి.. ఇది మంచి అవకాశంగా మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.