సాధారణ టీవీ చూసి.. చూసి విసిగిపోయి.. తక్కువ ధరలో మంచి స్మార్ట్ టీవీ ఏదైనా ఉందా! అని ఆలోచించే వారికి ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ శుభవార్త చెప్పింది. ఎలక్ట్రానిక్ సేల్ పేరిట.. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు వంటి అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లు ప్రకటించింది. ఈ సేల్ లో బ్రాండ్ స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ ఫేవరెట్ బ్రాండ్స్‌ను చౌక ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 14 నుంచి జూలై 18 వరకు ఎలక్ట్రానిక్ సేల్ అందుబాటులో ఉంటుంది. అందులో భాగంగా ఎల్జీ స్మార్ట్ టీవీపై డిస్కౌంట్ ఆఫర్ తో పాటు.. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వర్తించనుంది. ఈ ఆఫర్స్ ద్వారా ఎల్జీ 80 సెం.మీ (32 అంగుళాలు) హెచ్డీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీని చౌక ధరకే కొనుగోలు చేయవచ్చు. 27 శాతం డిస్కౌంట్: ఎల్జీ 80 సెం.మీ (32 అంగుళాలు) హెచ్డీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ లాంచింగ్ ధర రూ.21,990కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 27 శాతం డిస్కౌంట్ ఉంది. ఈ తగ్గింపుతో దాదాపు రూ.6 వేలు వరకు ఆదా అవుతుంది. తద్వారా రూ.15,999కే మీరు ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు.. కొనుగోలు సమయంలో ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడినట్లయితే మరో రూ.1500 వరకు తగ్గింపు లభిస్తుంది. అప్పుడు మరింత చౌకగా రూ.14,499కే ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్: మీ పాత టీవిని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్ఠంగా రూ.11,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే.. తగ్గింపు పూర్తిగా మీ టీవీ కండిషన్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. ఒకవేళ పూర్తి ఆఫర్ లభించినట్లయితే రూ.15,999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ టీవిని కేవలం రూ.4,999కే పొందవచ్చు. ఈ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే జూలై 18 లోపే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. LG 80 cm (32 inch) LED Smart TV pic.twitter.com/mzl5OZyZNy — Govardhan Reddy (@gova3555) July 15, 2022 ఇది కూడా చదవండి: Jio: జియో కస్టమర్లకు సూపర్ ఛాన్స్.. రూ.20కే 28GB ఎక్స్ట్రా డేటా..! ఇది కూడా చదవండి: కొత్త బైక్ కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ధరలు!