ప్రపంచలోనే అత్యంత ధనికుడైన ఎలన్ మస్క్.. నిత్యం ఏదొక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇటీవలి కాలంలో 3.49 లక్షల కోట్లతో ట్విట్టర్ సంస్థకు కళ్లు చెదిరే డీల్ ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. ఆ డీల్ కు ట్విట్టర్ కూడా ఒప్పేసుకుంది. అందుకు సంబంధించి ఇరు పార్టీలు డీల్ కూడా చేసుకున్నారు. కానీ, ఇప్పుడు ఎలన్ మస్క్ అడ్డం తిరిగాడు. ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేయబోవడం లేదని తేల్చి చెప్పాడు. ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేస్తానని చెప్పిన తర్వాత ఆ డీల్ ఎన్నో మలుపులు తిరిగింది. ట్విట్టర్ సంస్థ తీరుపై ఎలన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మస్క్ లేవనెత్తుతున్న సమస్యలపై ఆ సంస్థ సమాధానాలు ఇస్తూనే వస్తోంది. అయితే తాజాగా అసలు ఆ డీల్ లేదు క్యాన్సిల్ చేస్తున్నాను అంటూ మస్క్ ప్రకటించడంతో అంతా మొదటికొచ్చింది. ట్విట్టర్ ఒప్పందంలో పేర్కొంది ఒకటని.. కానీ, వాస్తవంలో ఉన్నది ఒకటంటూ మస్క్ ఆరోపించారు. BREAKING: Elon Musk terminates Twitter merger agreement via regulatory filing letter. Source: https://t.co/Lr4JD33xxi pic.twitter.com/MfLaasHoj8 — WallStreetPro (@wallstreetpro) July 8, 2022 స్పామ్ అంకౌంట్లు కేవలం 5 శాతమే ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొందన్నారు. ఒప్పందంలోని అనేక అంశాలను ట్విట్టర్ ఉల్లంఘించిందంటూ మస్క్.. అమెరికా సెక్యూరిటీస్, ఎక్స్చేంజ్ కమిషన్ కు తెలిపారు. “ట్విట్టర్ తో చేసుకున్న ఒప్పందాన్ని మస్క్ రద్దు చేసుకుంటున్నారు. చాలా అంశాలను ట్విట్టర్ ఉల్లంఘించడమే ఒప్పందం రద్దుకు కారణం. అగ్రిమెంట్ సమయంలో మస్క్‌కు ట్విట్టర్ సంస్థ తప్పుడు సమాచారం ఇచ్చింది” అంటూ మస్క్ తరఫు న్యాయవాదులు యూఎస్ ఎస్‌ఈసీకి తెలియజేశారు. అటు ట్విట్టర్ మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా వదిలేది ప్రసక్తే లేదనే సంకేతాలు ఇస్తోంది. JUST IN: Elon Musk terminates Twitter merger agreement via letter. — Morning Brew ☕️ (@MorningBrew) July 8, 2022 మస్క్ చేసుకున్న ఒప్పందం కొనసాగేలా అతనిపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ సంస్థ న్యాయపోరాటానికి సిద్ధమైంది. అందుకు కోర్టును కూడా ఆశ్రయించనున్నట్టు ట్విట్టర్ ఛైర్మన్ బ్రెట్ టేలర్ పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం ఆర్థిక కారణాలు, రెగ్యులేటరీ ఇబ్బందులతో ఒప్పందం రద్దు చేస్తే.. ట్విట్టర్‌కు ఎలాన్ మస్క్ బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్వయంగా మస్క్ డీల్ క్లోజ్ చేస్తున్న నేపథ్యంలో ఆ నిబంధన వర్తింస్తుందో లేదో ఆసక్తికరంగా మారింది. ట్విట్టర్ డీల్ కు మస్క్ గుడ్ బై చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. 1. Elon Musk officially terminates agreement to buy Twitter 2. Twitter board chair insists sale must go on & they will use court if necessary 3. Agreement has $1 billion fee if Elon Musk terminates the $44 billion cash deal to buy Twitter Next few days will be interesting. — Tola (@adetolaov) July 8, 2022 ఇదీ చదవండి: RBI సంచలన నిర్ణయం! ఆ నోట్లు చెత్తకుప్పలో పడేయాల్సిందే ఇదీ చదవండి: సామాన్యులకు ఊరట.. భారగా తగ్గిన వంట నూనె ధరలు!