రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు మండిపోతున్నాయి. మన దేశంలో కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెంచుతారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ అలా ఏం జరగలేదు. ఇంధన ధరల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చిన ప్రభుత్వం బల్క్ వినియోగదారులకు గట్టి షాకిచ్చింది. ఆ దెబ్బకు బంకులు మూసివేసే పరిస్థితి తలెత్తింది. ఆ వివరాలు.. ప్రభుత్వ రవాణా సంస్థలు, ప్రైవేట్ బస్ ఆపరేటర్లు, విమానాశ్రయాలు, మాల్స్, సినిమా హాళ్లు, టెక్ పార్కులు, పరిశ్రమలు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు వంటివి బల్క్ డీజిల్ వినియోగదారుల కేటగిరీ కిందకు వస్తాయి. వీటికి డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వీరంతా నేరుగా చమురు కంపెనీల నుంచి డీజిల్‌ను కొనుగోలు చేస్తుంటారు. ఇది కూడా చదవండి: షాకింగ్: డీజిల్‌పై ఒకేసారి రూ.75 పెంపు.. లీటరు పెట్రోల్ రూ.254 నిజానికి బల్క్ డీజిల్ ధర.. రిటైల్ ధరకన్నా తక్కువగా ఉంటుంది. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా తారుమారు అయ్యింది. ప్రస్తుతం బల్క్ డీజిల్ ధర పెరిగి.., సామాన్యుడికి పెట్రోల్ బంకుల వద్ద విక్రయిస్తున్న డీజిల్ ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం బల్క్ వినియోగదారులకు విక్రయించే డీజిల్ ధర లీటరుకు రూ.25 పెరిగింది. ఒకేసారి ఇంత భారీ ఎత్తున ధర పెరగడంతో డీజిల్ బల్క్ వినియోగదారులైన విమాన ఆపరేటర్లు, మాల్స్ నిర్వాహకులు, ప్రభుత్వ రవాణా సంస్థలు పెట్రోల్ బంకుల వద్దకి క్యూ కడుతున్నారు. నిజానికి వీరంతా.. ఇంతకు ముందు ఆయిల్ కంపెనీల నుంచి నేరుగా డీజిల్‌ని ఆర్డరు చేసేవారు. కానీ.. ఇప్పుడు బల్క్ డీజిల్ ధర పెరగడంతో.. ఆర్డర్ చేయడానికి బదులు బంకుల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ఈ నెలలో పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ అమ్మకాలు 20 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: 2 రూపాయలకే లీటర్ పెట్రోల్.. అందరి చూపు అటువైపే..! ముంబైలో బల్క్ వినియోగదారులకు విక్రయించే డీజిల్ ధర లీటరుకు రూ.122.05కు పెరిగింది. కానీ పెట్రోల్ బంకుల వద్ద విక్రయిస్తున్న డీజిల్ ధర మాత్రం లీటరుకు రూ.94.14గా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ బంకుల్లో లీటరు డీజిల్ ధర రూ.86.67 ఉండగా.. బల్క్, పారిశ్రామిక వినియోగదారులకు విక్రయించే డీజిల్ ధర దాదాపు రూ.115గా ఉంది. అందువల్ల బల్క్ వినియోగదారులు కూడా నేరుగా బంకుల వద్దే డీజిల్ తీసుకుంటున్నారు. మరోవైపు పెట్రోల్ బంకుల్లో ఇలా తక్కువ ధరకు డీజిల్ ని విక్రయిస్తుండటం వల్ల రిటైలర్లకు క్రమంగా నష్టాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా నయారా ఎనర్జీ, జియో-బీపీ, షెల్, రిలయన్స్ వంటి ప్రైవేటు రిటైలర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పుడున్న రేట్లతో ఎక్కువ ఇంధనాన్ని విక్రయించడం కన్నా బంకులు మూసివేయడం మంచిదన్న దిశగా ఆలోచన చేస్తున్నట్టు మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇది కూడా చదవండి: నకిలీ రేట్లతో నిలువునా దోచేస్తున్నారు.. ఇంతకుముందు 2008 సంవత్సరంలో ప్రభుత్వరంగ కంపెనీల నుంచి పోటీని తట్టుకోలేక రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశవ్యాప్తంగా 1,432 పెట్రోల్ బంకులను మూసివేసింది. బల్క్ వినియోగదారులు పెట్రోల్ బంకుల వైపు మళ్లుతున్నందు వల్ల రిటైలర్ల నష్టాలు పెరిగి మళ్లీ ఇలాంటి పరిస్థితి తలెత్తింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పెట్రోల్ బంకులు మూసివేయడం తప్ప మరో మార్గం లేదు. ఒకవేళ బల్క్ వినియోగదారులు అంత రేటు పెట్టి.. రిటైల్ గానే కనుక డీజిల్ కొంటే ఆ భారం అంతా సామాన్యుడి మీదే పడుతుంది. కాబట్టి.. ఎలా చూసుకున్నా ఈ సమస్యకి పరిష్కార మార్గం కనిపించడం లేదు. మరి.. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందింస్తుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.