ప్రస్తుత రోజుల్లో నెల మొత్తం ఎంత సంపాదించినా.. నెల చివరకు వచ్చేసరికి మిగులు అనేదే లేకుండా పోతుంది. ఇలాంటి సమయాల్లో ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు వచ్చినట్టయితే.. ఆదుకునే వారు ఉండరు. అలాంటి పరిస్థితుల్లో మనకు దారి చూపేది.. పర్సనల్ లోన్. ఎలాంటి ఆస్తి పత్రాలు, బంగారం తాకట్టు పెట్టుకోకుండా, వ్యక్తికున్న ఆదాయాన్ని బట్టి ఇచ్చేవే.. పర్సనల్ లోన్స్. చాలా మంది వీటికి అప్లై చేస్తున్నప్పటికీ.. బ్యాంకులు తమకు ఉన్న నియమ నిబంధనల ప్రకారం వీరు అర్హులు అన్న వారికి మాత్రమే లోన్లు ఇస్తుంటాయి. అందులోనూ వ్యక్తిగత రుణం వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. బ్యాంకులు అత్యుత్తమ క్రెడిట్ స్కోర్లను కలిగి ఉన్న వినియోగదారులకు తక్కువ వడ్డీ రేట్లకు లోన్లు ఇస్తుంటాయి. వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు అన్నది రుణ గ్రహీతల క్రెడిట్ స్కోరు ఆధారంగా ఉంటుంది. 800 కు పైగా స్కోరు ఉన్న వారికి ఒక రకంగా, 750-800 మధ్య ఉన్న వారికి ఒక రకంగా, 750కు దిగువన ఉన్న వారికి అధిక రేటును బ్యాంకులు సాధారణంగా చార్జ్ చేస్తుంటాయి. తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్న బ్యాంకులు ఐడీబీఐ బ్యాంకు 12నుంచి 60 నెలలు కాలానికి 8.90-14 శాతం వడ్డీతో పీఎన్ బీ 60 నెలలు కాలానికి 9.35-15.35 శాతం వడ్డీతో ఇండియన్ బ్యాంకు 12 నుంచి 36 నెలలు కాలానికి 9.40-9.90 శాతం వడ్డీతో కరూర్ వైశ్యా బ్యాంకు 12 నుంచి 60 నెలలు కాలానికి 9.40-19 శాతం వడ్డీతో ఎస్ బీఐ 6 నుంచి 72 నెలలు కాలానికి 9.80-12.80 శాతం వడ్డీతో యూనియన్ బ్యాంకు 60 నెలలు కాలానికి 10.20-12.40 శాతం వడ్డీతో రుణాలు అందిస్తున్నాయి.