కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్‌లు జులై1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇంత వరకు అమలు జరగలేదు. వీటి అమలులో ఎక్కడ జాప్యం జరుగుతుందో అసలు విషయం బయటకొచ్చింది. ఈ కొత్త చట్టాలను పార్లమెంటు ద్వారా ఆమోదించినప్పటికీ, కొన్ని రాష్ట్రాలు ఇంకా ఆమోదించలేదు. రాష్ట్రాలు వాటిని ఆమోదించిన తర్వాతే ఈ కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. కొత్త కార్మిక చట్టాల వల్ల దేశంలో పెట్టుబడులతోపాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నది కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం. కొత్త లేబర్ చట్టాలు అమల్లోకి వస్తే.. ఒక్కో ఉద్యోగి.. వారానికి 48 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన రోజుకు 12 గంటలు పనిచేస్తే.. 4 రోజులు పని చేస్తాడు. వారంలో నాలుగు పోతే మూడు రోజులు ఉంటాయి కనుక.. కంపెనీలకు అదనపు ఉద్యోగి అవసరం అవుతాడు కదా! అన్నది కేంద్రం వాదన. దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరగొచ్చు కూడా. అయితే.. ఈ కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తే ఒక్క పని వేళలే కాదు.. పిఎఫ్ కంట్రిబ్యూషన్, వేతనాలలో గణనీయమైన మార్పులు ఉండే అవకాశం ఉంది. కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే జరిగే మార్పులు.. కొత్త కార్మిక చట్టాలు అమలైతే, ఆఫీస్ పని వేళలను మార్చుకోవడానికి కంపెనీలకు వీలుంటుంది. ఆఫీసు పని గంటలను 8/9 గంటల నుండి 12 గంటల వరకు పెంచవచ్చు. కొత్త వేతన నియమావళి ప్రకారం బేసిక్ శాలరీ కనీసం 50 శాతం ఉండాలని నిర్దేశించడంతో ఉద్యోగులు తీసుకునే టేక్ హోం శాలరీపై ప్రభావం పడనుంది. ఉద్యోగి ఓవర్‌టైమ్ పనిచేయాల్సి వస్తే.. ఓవర్‌టైమ్ గంటల సంఖ్య 50 గంటల నుండి 125 గంటలకు పెంచాల్సి ఉంటుంది. వారంలో 48 పని గంటలు దాటితే సదురు ఉద్యోగికి..సంస్థలు అదనంగా ఓవర్ టైం చెల్లించాల్సి ఉంటుంది. పిఎఫ్ కంట్రిబ్యూషన్ పెరగొచ్చు. పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బు, గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది. కొత్త లేబర్ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా.. జాప్యం జరగడంతో త్వరలోనే అమలు కానున్నాయి. కొత్త లేబర్ చట్టాలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: RBI: బ్యాంకులో ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే.. ఇలా ఫిర్యాదు చేయండి! ఇదీ చదవండి: వడ్డీ లేకుండా రూ.3,00,000 ఋణం! ఇలా అప్లై చేసుకోండి.