‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 6’.. ఎంతో అట్టహాసంగా ఒక్కసారిగా 21 మందికి ఇంట్లోకి పంపడంతో అంతా రచ్చ రచ్చగా మారిపోయింది. అంతేకాకుండా మొదటిరోజు నుంచి బిగ్ బాస్ టాస్కులతో ఇంట్లోని సభ్యుల మధ్య చిచ్చు పెట్టేశాడు. ఇప్పటికే ఇంట్లో గ్రూపులు, జట్లు కట్టుకుని గొడవలు కూడా మొదలు పెట్టేశారు. క్లాస్, మాస్, ట్రాష్ తరగతులుగా విభజించి మళ్లీ అందులో కూడా మార్చుకునేందుకు మరో టాస్కు ఇస్తున్నాడు బిగ్ బాస్. మొదట బాలాదిత్య, శ్రీహాన్, ఆర్జే సూర్య క్లాస్ సెక్షన్‌లో ఉన్నారు. సింగర్ రేవంత్, ఇనయా సుల్తానా, గలాటా గీతూ ట్రాష్ లో ఉన్నారు. నిజానికి శ్రీహాన్ ఎంత సౌమ్యుడు, వ్యక్తిత్వం పరంగా ఎంత హుందాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఈసారి టాస్కులో మరోసారి అది రుజువైంది. ఆదిరెడ్డి టాస్కు గెలిచి మాస్ కేటగిరీ నుంచి క్లాస్ సెక్షన్‌కు ప్రమోట్ అయ్యాడు. అయితే అక్కడి నుంచి ఒకళ్లు మాస్‌కి మారాల్సి ఉంటుంది. అప్పుడు శ్రీహాన్ నేను వెళ్తానంటూ తనంతట తానే రావడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇవన్నీ పక్కన పెడితే రెండో రోజు శ్రీహాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. తాను సింగిల్ అంటూ తనకి స్వేచ్ఛ ఉందంటూ శ్రీహాన్ చెప్పుకొచ్చాడు. అయితే ఇవన్నీ సీరియస్ టోన్లో చేసినవి కాదులెండి. చాలా సరదాగా మాట్లాడుతూ వచ్చాడు. View this post on Instagram A post shared by Shrihan (@imshrihan) ఏం జరిగిందంటే.. మరీనా- రోహిత్ ఇద్దరూ రియల్ లైఫ్ కపుల్ అందరికీ తెలిసిందే. ఇద్దరూ నిద్ర లేచి డైనింగ్ టేబుల్ దగ్గర పంచాయితీ పెట్టారు. రాత్రి హగ్ చేసుకోబోతే చేసుకోనివ్వలా అంటూ రోహిత్ చెబితే.. అడిగినా హగ్ ఇవ్వలా అంటూ మరీనా కంప్లైంట్ చేసింది. రాత్రి చేయి వేయబోతే నెట్టేసిందని తాను చూశానంటూ శ్రీహాన్ చెప్పాడు. అప్పుడు సింగిల్స్ ఉంటే ఇలా చేస్తారా అంటూ శ్రీ సత్య అడుగుతుంది. అందుకు నువ్వంటే సింగిల్.. శ్రీహాన్ కాదుగా అంటూ మరీనా మాట్లాడుతుంది. అందుకు శ్రీహాన్ “నేను సింగిల్.. ఇంకో 100 డేస్ నాకు స్వేచ్ఛ ఉంది” అంటూ చెక్కేశాడు. ఆ మాటలు విన్న శ్రీసత్య సిరి విన్నావా అంటుంది. ప్రేక్షకులు మాత్రం మరి సిరి పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. శ్రీహాన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.