‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 6’.. ఈ బుల్లితెర రియాలిటీ షో ఆరో సీజన్ కూడా ఆసక్తికరంగా మొదలైంది. టాస్కులు, నామినేషన్స్ తో హౌస్ మొత్తం వేడెక్కిపోయింది. తొలివారం మొత్తం ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్తారు. అది ఎవరు అనేది తెలియాలంటే వారాంతం వరకు ఆగాల్సిందే. అయితే తొలి నామినేషన్స్ తో ఎవరు ఎలా ఉంటారు? ఎవరు ఎవరితో క్లోజ్ అనే విషయంపై అక్కడున్న సభ్యులకు, ప్రేక్షకులకు సైతం ఒక క్లారిటీ వచ్చింది. అందరూ ఎక్కువా రేవంత్‌ని నామినేట్ చేశారు. అతని ప్రవర్తన, అథారిటీ చేయడం నచ్చడం లేదని ముఖం మీద చెప్పేశారు. దీంతో అతని ఫ్యాన్స్ రేవంత్‌ని టార్గెట్ చేశారంటూ వాపోతున్నారు. ఇదిలా ఉండగా నామినేషన్స్ సమయంలో, ఆ తర్వాత శ్రీహాన్ విషయంలో కొన్ని ఆసక్తికర ఘటనలు జరిగాయి. రేవంత్ చేసిన పనికి శ్రీహాన్- తనకి రిలేషన్ కాస్త తగ్గిందంటూ కీర్తీ భట్ రేవంత్‌ని నామినేట్ చేసింది. రేవంత్ ఫైమాని సరిగ్గా పిలవలేదంటూ శ్రీహాన్- రేవంత్‌ని నామినేట్ చేశాడు. ఆ తర్వాత తిరిగి కీర్తీ భట్ని కూడా నామినేట్ చేశాడు శ్రీహాన్. ఎందుకంటే ఆమె- తనను తప్పుగా అర్థం చేసుకుందని.. తనని అవాయిడ్ చేయలేదంటూ శ్రీహాన్ చెప్పుకొచ్చాడు. అలా వారి మధ్య ఏదో జరుగుతోందని ప్రేక్షకులకు సైతం అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఇంకా బలపడుతుంది అనుకున్నారో ఏమో.. శ్రీహాన్ సైతం వెంటనే వచ్చి కీర్తీ భట్ తో మాట్లాడాడు. అసలు అతను ఎందుకు అలా ఉంటున్నాడో క్లారిటీ ఇచ్చాడు. View this post on Instagram A post shared by Shrihan (@imshrihan) ఆ క్లారిటీ నిజానికి శ్రీహాన్ జాగ్రత్త, సిరి విషయంలో భయమే అందరికీ కనిపించాయంటున్నారు. ఆ విషయాన్ని శ్రీహాన్ స్వయంగా ఒప్పుకున్నాడు. కీర్తీ భట్‌తో క్లోజ్ గా ఉంటే బయటకు ఎలా చూపిస్తారో? అది బయటకు ఎలా కనిపిస్తుందో అని భయం తనలో ఉందని చెప్పుకొచ్చాడు. అయినా తనను అవాయిడ్ చేయలేదనే చెప్పాడు. గత సీజన్లో సిరి- షణ్ముఖ్ విషయంలో బయట ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. వారు క్లోజ్ కావడం వల్ల షణ్ముఖ్- దీప్తీ సునైనాలకు బ్రేకప్ కూడా జరిగింది. మరి.. శ్రీహాన్ ఆ విషయంలో భయపడుతున్నాడో? లేక అమ్మాయిలతో క్లోజ్‌గా ఉంటే సిరి ఏమనుకుంటుందో అని భయపడుతున్నాడో అర్థం కాలేదు. కానీ, జాగ్రత్త పడుతున్నట్లు కనిపించాడు. నెటిజన్లు మాత్రం సిరికి భయపడే అలా చేస్తున్నట్లు కామెంట్ చేస్తున్నారు. శ్రీహాన్ నిజంగానే సిరికి భయపడుతున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Shrihan (@imshrihan) View this post on Instagram A post shared by Shrihan (@imshrihan) ఇదీ చదవండి: సగం మంది సింగర్ రేవంత్‌ని నామినేట్ చేశారు.. అతడిని టార్గెట్ చేస్తున్నారా? ఇదీ చదవండి: వీడియో: తనను బాడీ షేమింగ్ చేశారన్న మరీనా ఆరోపణల్లో నిజమెంత? ఇదీ చదవండి: బిగ్ బాస్ కంటెస్టెంట్లను గుర్తుపట్టలేక గగ్గోలు పెడుతున్న జనాలు!