‘బిగ్ బాస్ 6 తెలుగు’ సీజన్ ఎంత జోష్‌తో స్టార్ట్ అయ్యిందో అంతే జోష్‌తో కొనసాగుతోంది. తొలిరోజు కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ టాస్క్ పేరుతో కుంపటి పెట్టాడు. క్లాస్, మాస్, ట్రాష్ అంటూ సభ్యుల మధ్య మూడు తరగతులను ఏర్పాటు చేశారు. అయితే టాస్క్ ప్రారంభానికి ముందే ఎవరిని ఎవరు ఎంచుకోవాలి అనే కాన్సెప్ట్ లో పరోక్షంగా గొడవలు కనిపించాయి. ఇక్కడ కూడా నామినేషన్స్ తరహాలో ఒకరికి ఒకరు ట్రాష్ ఇచ్చుకున్న వాళ్లు కూడా ఉన్నారు. మొదటిరోజు నుంచే గీతూ రాయల్- ఇనయా సుల్తానా మధ్య రచ్చ మొదలైంది. ఇద్దరూ ట్రాష్ కేటగిరీలో ఉండటానికి కారణం వారి మధ్య రేగిన బాత్‌రూమ్ గొడవే. ఈ టాస్కులో ఇంకో మతలబు ఏంటంటే.. క్లాస్‌లో ఉన్న వాళ్లు నామినేట్ కారు, ట్రాష్‌లో ఉన్న ముగ్గురు నేరుగా నామినేషన్స్ లో ఉంటారు. అయితే టాస్క్ ఎండ్ బజర్ మోగే సమయంలో ఎవరైతే ట్రాష్‌లో ఉంటారో వాళ్లు డైరెక్ట్ నామినేషన్స్. ఇప్పుడు వాళ్ల కేటగిరీ మార్చుకునేందుకు టాస్కులు కూడా షురూ చేశారు. తొలి టాస్క్ లో ఆదిరెడ్డి- ఇనయా సుల్తానా తలపడ్డారు. అందులో ఆదిరెడ్డి విజయం సాధించి.. తన కేటగిరీని మెరుగు పరుచుకుని మాస్ నుంచి క్లాస్ కు వెళ్లాడు. అక్కడ వీఐపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. క్లాస్ నుంచి అతడిని స్వాప్ చేసేందుకు శ్రీహాన్ మాస్‌కు మారాడు. మొదటి రోజు నుంచే ఆట ఎంతో రసవత్తరంగా మారింది. View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) ఈ టాస్కులో భాగంగానే ఏడిపించేసే ప్రక్రియ ఒకటి మొదలు పెట్టాడు బిగ్ బాస్. అందులో భాగంగా ట్రాష్‌లో ఉన్న సభ్యులు వారిని ఒక తారగా ఎవరు అయితే అనుకుంటారో వారి పేరు రాసి బాటిల్‌లో పెట్టి పూల్ పడేయాలి. ఇందులో భాగంగా ఇనయా సుల్తానా తన తండ్రిని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యింది. తనకోసమే ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పుకొచ్చింది. ఎంతో ఏడుస్తూ తన బాధ మొత్తాన్ని ఇంటి సభ్యులు, ప్రేక్షకులతో పంచుకుంది. అయితే ఇనయా మాట్లాడుతున్న సమయంలో కీర్తీ భట్ ఎంతో ఎమోషనల్ అయిపోయింది. ఆమెకు వెళ్లి హగ్ ఇచ్చిన కీర్తీ.. ఆ తర్వాత కూడా వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంట్లోని సభ్యులు మొత్తం ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నం చేశారు. తన ఫ్యామిలీని గుర్తు చేసుకుని కీర్తీ ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. View this post on Instagram A post shared by Inaya Sultana (@inayasulthanaofficial) కీర్తీ భట్ గతంలో ఎంత బాధ ఉందో అక్కడున్న కొంత మందికి తెలుసు కాబట్టి ఆమెను అర్థం చేసుకున్నారు. ప్రేక్షకుల్లో కూడా చాలా మందికి ఆమె గతం తెలుసు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆమె ఆ విషయాన్ని వెల్లడించింది. అదేంటంటే.. ఓ రోజు ఓ గుడికి వెళ్లి వస్తుండగా వాళ్లు వచ్చే కారుకి యాక్సిడెంట్ జరిగింది. ఆ ఘోర ప్రమాదంలో కీర్తీ భట్ మినహా తన ఫ్యామిలీ మొత్తం ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదంలో గాయపడిన కీర్తీ భట్ మూడు నెలలు కోమాలో ఉంది. ఆ తర్వాత పేరెంట్స్ గురించి తెలుసుకుని ఎంతగానో కుమిలిపోయింది. ఇప్పుడు ఒక అమ్మాయిని దత్తత తీసుకుని ఆమెను పెంచుకుంటోంది. ఈ గతం, తన తల్లిదండ్రులు అందరూ గుర్తొచ్చి కీర్తీ భట్ కన్నీరు మున్నీరు అయ్యింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) ఇదీ చదవండి: టాలెంట్ వేరే బిహేవియర్ వేరే.. రేవంత్‌పై గీతూ ఆగ్రహం ఇదీ చదవండి: బిగ్ బాస్ లో అప్పుడే గొడవ.. గీతూ-ఇనయా ఒకరిపై ఒకరు..!