ఫాహిమా షేక్ అలియాస్ ఫైమా.. ప్రస్తుతం లీడింగ్ లేడీ కమెడియన్‌గా ఒక వెలుగు వెలుగుతోంది. అటు జబర్దస్త్, స్పెషల్ ఈవెంట్స్ అంటూ చెలరేగిపోతోంది. యూట్యూబ్‌లోనూ కొత్త కొత్త వీడియోస్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఫైమా ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఆమె టాలెంట్‌ని పొగుడుతూ ఉన్న వాళ్లు చాలా మందే ఉన్నారు. బిగ్ బాస్‌లో అడుగు పెట్టగానే ఫైమా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది. అంతా బిగ్ బాస్‌లో అడుగుపెట్టింది కాబట్టి సక్సెస్ అవుతుంది అంటున్నారు. నిజానికి ఫైమా జీవితంలో సక్సెస్ అయిన తర్వాతనే హౌస్‌లో అడుగుపెట్టింది. అయితే ఫాహిమా షేక్.. ఫైమాగా ఎలా మారింది? ఆమె జీవితం ఎలా మలుపు తిరిగింది అనే విషయాలు తెలుసుకుందాం. ఫైమా జీవితం చాలా మంది అనుకున్నట్లు అంత సాఫీగా సాగిపోలేదు. ఆమెది నిరుపేద కుటుంబం. అమ్మానాన్నలకు నలుగురు అమ్మాయిలు. ఫైమానే అందరి కంటే చిన్నది. తండ్రి దినసరి కూలీగా కష్టపడుతుండేవాడు. అమ్మ బీడీలు చుడుతూ తనవంతు సాయంచేస్తుండేది. అంత కష్టపడినా కూడా నెలాఖరున ఇంటి కిరాయి కట్టే పరిస్థితి కూడా ఉండేది కాదు. 30 ఏళ్లుగా వాళ్లు కిరాయి ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. కొన్నిసార్లు అద్దె ఇంట్లో మరుగుదొడ్డి కూడా ఉండేది కాదు. ఆడపిల్లలు చెట్లు వెనక్కి వెళ్లే పరిస్థితి చూసి అమ్మ కుమిలిపోతూ ఉండేది. అంతటి కష్టాల్లోనూ ఫైమాని మాత్రం చదివిస్తూనే ఉన్నారు. అలా చదివించడమే ఇప్పుడు వీళ్ల జీవితాలు మారిపోయేలా చేసింది. View this post on Instagram A post shared by F-A-I-M-A_S-H-I-E-K_OFFICIAL (@faima_patas) అదెలా అనుకుంటున్నారా? ఒకప్పటి స్టాండప్ కామెడీ షో పటాస్ గురించి అందరికీ తెలిసు. ఒకసారి ఫైమా చదువుతున్న కాలేజీ వాళ్లంతా పటాస్ షోకి వచ్చారు. ఆ సమయంలో ఫైమా కామెడీ టైమింగ్ చూసి విజయ్ అనే వ్యక్తి కామెడీకి పనికొస్తది అనే ఉద్దేశంతో ఆమెతో చిన్న పార్ట్ చేయించారు. రెండ్రోజుల్లోనే అది మిలియన్ వ్యూస్ దాటిపోయి ట్రెండింగ్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి అంతా మాకు ఫైమా కావాలంటూ పటాస్ షో వీడియోస్ కింద రిక్వెస్టులు పెట్టారు. అయితే ఫైమాని ఆ షోకి పంపేందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈ విషయంలో రవి, శ్రీముఖిలాంటి వారు అర్థమయ్యేలా చెప్పి వారు ఒప్పుకోవడానికి హెల్ప్ చేశారు. ఆ తర్వాత ఫైమా పటాస్ షోలో దూసుకుపోయింది. View this post on Instagram A post shared by F-A-I-M-A_S-H-I-E-K_OFFICIAL (@faima_patas) కానీ, కొన్నాళ్లకు ఆ పటాస్ షోని ఆపేశారు. మళ్లీ జీవితంలో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. మళ్లీ ఫైమా ఇంటికే పరిమితమైపోయింది. అప్పుడు ఆమెకు జబర్దస్త్ రూపంలో అవకాశం దక్కింది. ఆ టైమ్‌లో లేడీ గెటప్స్ నుంచి జబర్దస్త్ లో లేడీ కమెడియన్ల కోసం వెతుకులాట ప్రారంభించారు. అలాంటి టైమ్‌లో ఫైమాకు జబర్దస్త్ అవకాశం దక్కింది. ఒకసారి జబర్దస్త్ షోలో అడుగుపెట్టిన తర్వాత ఫైమా మళ్లీ కెరీర్‌లో తిరిగి చూసుకోలేదు. ఎంతో అద్భుతమైన నటన, కామెడీ టైమింగ్, జిమ్మిడి అంటూ తనకంటూ ఒక మేనరిజాన్ని క్రియేట్ చేసుకుంది. టీమ్ లీడర్లు, మేల్ కమెడియన్లకు ఉన్న క్రేజ్ కంటే ఫైమాకే ఎక్కువ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. ఫైమా స్కిట్స్ కూడా యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంటూ ఉంటాయి. View this post on Instagram A post shared by F-A-I-M-A_S-H-I-E-K_OFFICIAL (@faima_patas) ఫైమా జీవితంలో ఓ ప్రేమ కథ కూడా ఉంది. తనతో పాటు కామెడీ చేసే ప్రవీణ్- ఫైమా ప్రేమలో ఉన్నారు. వీళ్లిద్దరూ కలిసి కొన్నాళ్లు ఓ కామెడీ సిరీస్‌ని కూడా చేశారు. ప్రవీణ్ కూడా మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. తన బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అయితే ప్రవీణ్‌కు చిన్నప్పుడే తల్లి చనిపోయింది. ఇటీవలే తండ్రి కూడా చనిపోయాడు. ప్రవీణ్ గురించి గుర్తుచేసుకుంటూ ఫైమా బిగ్ బాస్ స్టేజ్‌పైనే ఎమోషనల్ అవ్వడం చూశాం. ఇలాంటి టైమ్‌లో ప్రవీణ్ పక్కన ఉండాలి అనుకుంది. కానీ, తన పక్కన ఉన్న దానికంటే బిగ్ బాస్‌లో విజయం సాధిస్తేనే తనకి ఎక్కువ ఆనందం అంటూ ప్రవీణ్ ఫైమాకి సర్దిచెప్పి, ధైర్యం చెప్పి ఆమెను బిగ్ బాస్‌కు పంపాడు. View this post on Instagram A post shared by F-A-I-M-A_S-H-I-E-K_OFFICIAL (@faima_patas) చూశారుగా ఫాహిమా షేక్ నుంచి ఫలక్‌నుమా ఫైమాగా ఎలా మారిందో. ‘మంచివాళ్లు మొదట కష్టపడచ్చు కానీ ఓడిపోరు’ అనే రజినీకాంత్ మాట ఫైమా జీవితానికి యాప్ట్ గా ఉంటుంది. కొడుకులు లేక పోయినా తల్లిదండ్రుల బాధ్యత తీసుకుని వాళ్లకు కొడుకుగా మారింది. 30 ఏళ్లుగా అద్దె ఇళ్లల్లో వారు పడుతున్న యాతనకు ఫుల్ స్టాప్ పెట్టాలని బిగ్ బాస్‌లో అడుగుపెట్టింది. ఫైమా కచ్చితంగా టాప్-5లో నిలుస్తుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. నీ ముఖం బిగ్ బాస్‌కి వెళ్తుందా? అద్దంలో చూసుకున్నావా అనే కామెంట్స్ భరించిన దగ్గరనుంచి ఇప్పుడు హౌస్‌లో స్ట్రాంగ్ ప్లేయర్ గా మారిన ఫైమా జర్నీ ఎందరికో ఆదర్శం. మరి.. ఫైమా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో విజయం సాధిస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by F-A-I-M-A_S-H-I-E-K_OFFICIAL (@faima_patas) ఇదీ చదవండి: వీడియో: బిగ్ బాస్ హౌస్‌లో ఆదిరెడ్డి రివ్యూలు.. సంబంధంలేని వాటిల్లో రేవంత్ వేలు పెడుతున్నాడు..! ఇదీ చదవండి: ‘బిగ్ బాస్’ సీజన్-6 ప్రైజ్ మనీ ఎంత.. హౌస్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ ఎవరికంటే!