బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రేక్షకులు అనుకున్న దానికన్నా, సీజన్ మీద పెట్టుకున్న అంచనాల కన్నా మించి రాణిస్తోంది. ఈసారి పెద్దగా తెలిసిన ముఖాలు లేవంటూ కామెంట్లు వస్తున్నా.. షో మాత్రం దూసుకుపోతోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు.. హౌస్‌లో మొదటి రోజు నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచే నువ్వో గ్రూప్, నేనో గ్రూప్ అంటూ స్టార్ట్ చేశారు. రోజులు గడుస్తున్న కొద్దీ అవి ఇంకాస్త ముదరడం ప్రారంభమయ్యాయి. కెప్టెన్సీ పోటీదారుల టాస్కు, నామినేషన్స్ తో గొడవలు మొత్తం పీక్స్ కి చేరాయి. తాజాగా స్పాన్సరర్ టాస్క్ అని పెట్టారు. దానిలో కూడా గొడవలు ఊపందుకున్నాయి. మొదటి సింగర్ రేవంత్- ఆరోహి మధ్య గట్టిగానే మాటల యుద్ధం నడిచింది. టాస్కులో పాల్గొనాలని ఆరోహి- రేవంత్ ఇద్దరూ అనుకున్నారు. అయితే రేవంత్ అన్న మాటలకు ఆరోహి నేను పార్టిసిపేట్ చేయను అంటుంది. తర్వాత అందరూ చెప్పారని ఆరోహి పాల్గొంటుంది.. కానీ, ఓడిపోతుంది. ఆ తర్వాత రేవంత్ అనే మాటలతో ఆరోహి బాత్ రూమ్‌కి వెళ్లి ఏడుస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ రేవంత్ మాట్లాడించాలని ప్రయత్నించగా ఆరోహీ స్పందించదు. అప్పుడు రేవంత్- ఆర్జే సూర్యాతో మాట్లాడతూ.. టీమ్‌లో ఓడిపోతే డెఫనెట్‌గా మాట్లాడతారు అనగా.. అది ఆరోహీకి మాత్రం డిఫెక్ట్ అను వినిపిస్తుంది. ఆమె తప్పుగా అర్థం చేసుకుని రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వేలు చూపించగానే రేవంత్ కూడా తిరిగి ఫైర్ అవుతాడు. తర్వాత ఆ గొడవ కొనసాగుతూ పోయింది. View this post on Instagram A post shared by Singer Revanth (@singerrevanth) బయట కూర్చొని కూడా రేవంత్ గొడవ గురించే మాట్లాడుతూ ఉంటాడు. “నేనేమీ అల్లాటప్పాగాడ్ని కాదు. నాతో గొడవకు దిగితే నేను కూడా గొవడ పడతాను. నా తప్పు లేకుండా నేను ఎందుకు తగ్గుతాను. నాతో ఎందుకు పెట్టుకున్నారా అని బాధపడేలా చేస్తాను. నేనేమీ బయటకు వెళ్లాక ఇవేమీ పట్టించుకోను. అంతా ఏదో ప్లాన్ చేసుకుని వస్తారు.. అయినా ఇక్కడ పీకేదేమీ లేదు.” అంటూ రేవంత్ మాట్లాడుతూనే ఉంటాడు. ఆ మాటలు విన్న యూట్యూబర్ ఆదిరెడ్డి స్పందిస్తాడు. ఎవరైనా పీకేదేమీ లేదులే బ్రదర్ అంటూ సమాధానం చెబుతాడు. అందుకు రేవంత్ మళ్లీ స్పందిస్తూ.. మీరెందుకు బ్రదర్ ఊరికే రియాక్ట్ అవుతున్నారంటూ మళ్లీ ఆదిరెడ్డిని ప్రశ్నిస్తాడు. అతను నేను మీకోసమేమ చెప్పేది నెగెటివ్‌గా వెళ్తుంది అంటూ చెప్పే ప్రయత్నిస్తుంటాడు. View this post on Instagram A post shared by Adi Reddy (@adireddyofficial) తర్వాత రేవంత్ మాటల్లో నేనేమీ సోషల్ మీడియా నుంచే రాలేదంటూ కామెంట్ చేస్తాడు. అంటే ఆ మాటలు ఆదిరెడ్డి, గలాటా గీతు వంటి వారికి బాగా గుచ్చుకున్నాయి. తర్వాత ఆదిరెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశాడు. “ఇక్కడ బిగ్ బాస్‌కి వచ్చాక సోషల్ మీడియానా, నువ్వు స్టార్ హీరోవా, నీకు ఎంత ఆస్తి ఉంది, నీస్టేటస్ ఏంటి అనేమీ ఉండదు. అందరూ ఈక్వల్ ఇక్కడ. ఎవరైనా ఒక్కటే సోషల్ మీడియా నుంచి వస్తే ఏంటి? మీకులా సోషల్ మీడియా నుంచి రాలేదంటూ మాట్లాడుతున్నావ్. బిగ్ బాస్ బౌస్‌లో ఎవడైనా ఒకటే. అలాంటి డిఫరెన్సెస్ ఏమీ ఉండవు. అర్థమయ్యేలా చెబ్దామంటే ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు” అంటూ ఆదిరెడ్డి గట్టిగానే స్పందించాడు. రేవంత్- ఆదిరెడ్డి ఇష్యూలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Adi Reddy (@adireddyofficial) View this post on Instagram A post shared by Singer Revanth (@singerrevanth) ఇదీ చదవండి: ఇనయా రెయిన్ డ్యాన్స్.. కంట్రోల్ చేసుకోలేకపోయిన చంటి! ఇదీ చదవండి: రేవంత్- ఆరోహిల మధ్య మాటల యుద్ధం.. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ! ఇదీ చదవండి: నా భర్తని పక్కకి పిలవడానికి నువ్వు ఎవరవే? శ్రీ సత్యపై బిగ్ బాస్ మెరీనా ఫైర్!