బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. హౌస్ మొత్తం వాదనలు, మాటలు, గొడవలు అబ్బో అన్నీ కలిపి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. మొదటి రోజు నుంచి నడుస్తున్న గొడవలు తార స్థాయికి చేరాయి. ముఖ్యంగా రేవంత్ వర్సెస్ హౌస్ మేట్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజానికి రేవంత్‌కి అందరూ ఎంత చెప్పినా మనోడు మాత్రం ఎక్కడా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. హౌస్‌లో సభ్యులు ఇంకా రేవంత్ బిహేవియర్ విషయంలో నెగెటివ్‌గానే ఆలోచిస్తున్నారు. గలాటా గీతూ లాంటి బిగ్ బాస్ రివ్యూయర్ అయితే.. రేవంత్ ఎంత ఫాస్ట్ గా బయటకు వెళ్తే అంత మంచిది అంటూ స్ట్రైట్‌గా చెప్పేసింది. లేదంటే ఇంత గొప్ప సింగర్ ఇలా బిహేవ్ చేస్తున్నాడంటూ జనాలు అనుకుంటారు. ఆయన ప్రవర్తన మార్చుకోకపోతే బాగా బ్యాడ్ అవుతాడంటూ ఆమె చెప్పడం ప్రేక్షకులను సైతం ఆలోజింపచేశాయి. తాజాగా సింగర్ రేవంత్‌కు న్యూస్ ప్రెజెంటర్ ఆరోహీ రావుకు గొడవ జరిగింది. బిగ్ బాస్ హౌస్‌లో పెట్టిన ఒక స్పాన్సరర్ గేమ్‌లో ఈ రచ్చ మొదలైంది. సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. రెండు గ్రూపలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు బజర్ కొట్టి ఆన్సర్ చెప్పాలి. మొదట ఆరోహీ రావు లేవగా.. రేవంత్ నేను వెళ్తా అంటూ చెప్పుకొచ్చింది. అందుకు రేవంత్ బజర్ నొక్కాలంటే యాక్టివ్ ఉండాలి అంటూ చెప్పగానే ఆరోహీ మీరే వెళ్లండి అంటుంది. ఆ తర్వాత అంతా ఆరోహిని వెళ్లమనగా ఆమె వెళ్తుంది. అయితే ఆ గేమ్‌లో వాళ్ల ప్రత్యర్థులు గెలుస్తారు. ఆ తర్వాత రేవంత్ మాట్లాడుతూ ముందే ఆలోచించుకోమంది అందుకే అని అనడంతో ఆరోహీ బాగా హర్ట్ అవుతుంది. బాత్‌రూమ్‌కి వెళ్లి ఏడ్చేసి వస్తుంది. View this post on Instagram A post shared by Singer Revanth (@singerrevanth) ఆమె వచ్చిన తర్వాత రేవంత్ తన పక్కన కూర్చోమంటూ పిలిచినా కూడా ఆరోహీ రావు రెస్పాండ్ కాదు. నన్ను ఎవరూ మందలించొద్దు ప్లీజ్ అంటూ వెళ్లిపోతుంది. తర్వాత సూర్యను హగ్ చేసుకుని బాధ పడుతుండగా రేవంత్ వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో వారి మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుండగా రేవంత్- సూర్యాతో డెఫెనెట్‌గా టీమ్‌లో ఎవరైనా అంతే అనుకుంటారు అనగా.. ఆమెకు అది డిఫెక్ట్ అని వినిపించి హైపర్ అవుతుంది. వేలు చూపించి మాట్లాడగా రేవంత్ ఆగ్రహానికి గురవుతాడు. అక్కడ వారి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఛీ అసలు ఆయనతోని మాట్లాడటమే నాతోని కాదంటూ ఆరోహి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు రేవంత్ వేలు చూపించి మాట్లాడటం ఏంటంటూ సూర్యాతో చెప్పుకొస్తాడు. View this post on Instagram A post shared by Arohi Rao (@arohi_rao) “వేలు చూపించడం ఏంటి బ్రో? నేను జోకులేస్తే నార్మల్‌గా తీసుకుంటా పడతా. డసంట్ మీన్.. కొన్నిసార్లు మనం ఎవరు ఏంటనేది గుర్తొచ్చినప్పుడు కొన్ని టచ్ అవుతాయి. మాట్లాడుతుంటే ఇప్పుడేమీ వద్దు తర్వాత మాట్లాడతాను అంటే ఫైన్. అరవద్దు అంటే ఏంటి?” అంటూ రేవంత్ చాలా కోపంగా మాట్లాడతాడు. తర్వాత సూర్యాతో మళ్లీ మాట్లాడుతూ.. “నేనేమీ అల్లాటప్పాగాడ్ని కాదు. నాతో ఎందుకు పెట్టుకున్నానా అని బాధ పడేలా చేస్తా. బయటకి వెళ్లాక కాదు.. ఇక్కడే చూపిస్తా నేనేంటో” అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత కెమెరా దగ్గరకి వెళ్లి.. “నా వల్ల ఇబ్బంది ఉంటే నన్ను పంపించేయండి. అంతేగానీ నేను ఈ డ్రామాలు ఇవన్నీ పడలేను. నాతో ప్రాబ్లమ్ అయితే నన్ను ఈ వీక్ పంపేయండి” అంటూ రేవంత్ చెప్పుకొస్తాడు. అయితే వీళ్ల గొడవ హౌస్ మొత్తంలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. కొందరు రేవంత్ కి సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు ఆరోహి రావుకు మద్దతుగా నిలుస్తున్నారు. రేవంత్ వర్సెస్ ఆరోహి గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Singer Revanth (@singerrevanth) View this post on Instagram A post shared by Arohi Rao (@arohi_rao) ఇదీ చదవండి: నా భర్తని పక్కకి పిలవడానికి నువ్వు ఎవరవే? శ్రీ సత్యపై బిగ్ బాస్ మెరీనా ఫైర్! ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వాళ్ళు పతివ్రతలు ఎలా అవుతారు: CPI నారాయణ! ఇదీ చదవండి: శ్రీ సత్య గతం తెలిసి హౌస్ మేట్స్ కన్నీరు! అనవసరంగా నామినేట్ చేశారా?