బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. అప్పుడే హౌస్ మొత్తం గరం గరం అయిపోయింది. మొదటి రోజు నుంచి గొడవలు, గ్రూపులు అంటూ నానా యాగి చేస్తున్నారు. అందులో బిగ్ బాస్ కూడా ఏ విధంగా గొడవలు పెడదామా అన్నట్లు ప్రతి టాస్కుని గ్రూపులు చేయడం, రిజల్ట్ వచ్చాక వేరే వాళ్లని స్వాప్ చేయండి అనడం చేస్తూ బాగా ఇరకాటంలో పెడుతున్నాడు. తాజాగా హౌస్ మొత్తం గలాటా గలాటా అయ్యింది. ముఖ్యంగా రేవంత్- ఆరోహిల మధ్య మాటల యుద్ధం నడిచింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కామెంట్ చేసుకున్నారు. రేవంత్ అయితే అల్లాటప్పాగాడిని కాదు.. నేనేంటో చూపిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. నాతో ఎందుకు పెట్టుకున్నానా అని బాధ పడేలా చేస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. వీళ్ల గోల ఇలా ఉంటే చలాకీ చంటి మాత్రం తనవంతుగా హౌస్‌లో సభ్యులను నవ్విస్తన్నాడు. చంటి ఒక్క ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాదు.. పనులు కూడా బాగానే చేస్తున్నాడు. కానీ, తనకు ఏ పని అలాట్ చేస్తే అదే పని చేస్తున్నాడు. అందరిలా కాకుండా తాను ఎంతో ప్రత్యేకంగా వ్యవహరిస్తున్నాడు. తనను నామినేట్ చేసిన సమయంలోనూ తన పాయింట్స్ ఏంటో క్లియర్‌గా చెప్పి ఎంతో హుందాగా వ్యవహరించాడు. అంతేకాకుండా గీతూ రాయల్ తన విషయంలో కామెంట్ చేయగా.. ఆమెకు కూడా కాస్త గట్టిగానే క్లారిటీ ఇచ్చాడు. ఇది కాదు ఇది వాస్తవం అంటూ క్రిస్టల్ క్లియర్‌గా ఉన్నది ఉన్నట్లు చెబుతూ చంటి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. ప్రస్తుతానికి అయితే చంటి ఇంకా ఎలాంటి టాస్కుల్లో పాల్గొనలేదు. వాటిలో కూడా రాణిస్తే చంటి స్ట్రాంగ్ ప్లేయర్ అవుతాడు. View this post on Instagram A post shared by Chalaki Chanti (@chalakichanti_official) గురువారం జరిగిన దానిలో చంటి తనలోని నాటీ యాంగిల్ కూడా ఇంట్లోని సభ్యులకు పరిచయం చేశాడు. ఇనయా సుల్తానా చీరకట్టుకుని ఉంది. మధ్యాహ్నం వర్షం పడగా ఆమె డాన్స్ చేసేందుకు ట్రై చేసింది. చలాకీ చంటి సోఫాలో కూర్చుని ఆమెకు స్టెప్పులు కొరియోగ్రఫీ చేశాడు. చీర ఇలా పట్టుకుని గుడ్రంగా తిరుగు.. అలా చెయ్, ఇలా చెయ్ అంటూ దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. మధ్యలో ఇనయా మాత్రం..మ్..మ్ అంటూ ఒకరకమైన ఎక్స్ ప్రెషన్ ఇవ్వగా అది ఆర్జే సూర్యా చూసి మళ్లీ అడుగుతాడు. అయితే ఆ కాసేపు చంటి ఇనయా సుల్తానాను కాలేజ్ స్టూడెంట్ ఆట పట్టించాడు. హౌస్‌లో సభ్యులు అది చూస్తా తెగ నవ్వుకున్నారు. చంటి- ఇనయా వాన సాంగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Inaya Sultana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Inaya Sultana (@inayasulthanaofficial) ఇదీ చదవండి: రేవంత్- ఆరోహిల మధ్య మాటల యుద్ధం.. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ! ఇదీ చదవండి: నా భర్తని పక్కకి పిలవడానికి నువ్వు ఎవరవే? శ్రీ సత్యపై బిగ్ బాస్ మెరీనా ఫైర్! ఇదీ చదవండి: శ్రీ సత్య గతం తెలిసి హౌస్ మేట్స్ కన్నీరు! అనవసరంగా నామినేట్ చేశారా?