బిగ్ బాస్.. ప్రపంచంలోనే అతి పెద్ద రియాలిటీ షో ఇది. విదేశాల నుంచి ఈ కాన్సెప్ట్ ని మనవాళ్లు అందిపుచ్చుకున్నారు. భారతదేశంలో ప్రారంభించిన ప్రతి భాషలో ఈ కాన్సెప్ట్ సక్సెస్ అయ్యింది. హిందీలో అయితే 13 సీజన్లు పూర్తి చేసుకుంది. సౌత్‌లో కూడా ఈ బిగ్ బాస్ షో టాప్ రియాలిటీ షోగా కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగులో అయితే ఇప్పటికే 5 సీజన్లు పూర్తి చేసుకుంది. అటు బిగ్ బాస్ నాన్‌స్టాప్ పేరిట ఓటీటీ సీజన్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ షో ద్వారా సెలబ్రిటీలు అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. సెలబ్రిటీలుగా అడుగుపెట్టి ఆర్థికం స్థిరపడిన వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అయితే ఈ షో ద్వారా నెగెటివిటీ మూటగట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అలా బిగ్ బాస్ షోలో అడుగుపెడితే అయితే సెలబ్రిటీ హోదా వస్తది, లేదంటే మంచిగా పైసలు వస్తాయి. కానీ, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ మాత్రం ఈ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను బిగ్ బాస్ విన్నర్ అని చెప్పుకోవడం మానేశానంటూ సన్నీ కామెంట్ చేశాడు. బిగ్ బాస్ షో వల్ల ఒరిగేది ఏమీ ఉండదు అని కూడా చెప్పుకొచ్చాడు. అయితే షో విన్నర్ అయిన సన్నీ ఇలాంటి మాటలు మాట్లాడటం సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. అంతేకాకుండా కొన్ని విమర్శలు, చర్చలకు సైతం దారితీస్తున్నాయి. సన్నీ కూడా ప్రైజ్ మనీ తీసుకున్నాడుగా? ఆర్థికంగా అయినా లాభ పడ్డాడుగా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by VJ Sunny (@iamvjsunny) అసలు వీజే సన్నీ ఏ మన్నాడంటే.. “బిగ్ బాస్ షో వల్ల నాకు ఒరిగిందేమీ లేదు. నేను బిగ్ బాస్ విన్నర్ అని కూడా చెప్పుకోవడం మానేశాను. ఎవరినైనా కలిసినప్పుడు నేను బిగ్ బాస్ విన్నర్‌ని అని చెబితే అసలు ఆ షో ఏంటి అని అడుగుతున్నారు. బిగ్ బాస్ షో వల్ల నాకు ఫేమ్, నేమ్ వచ్చిన మాట నిజమే. కానీ, నన్ను చాలా మంది గుర్తు పట్టడం లేదు. ఒక ఫేమస్ డైరెక్టర్ కూడా బిగ్ బాస్ విన్నర్‌ని అంటే అసలు ఆ షో ఏంటి అని అడిగారు. ఇంక నేను విన్నర్ అని చెప్పుకోవడం మానేసి నా కెరీర్ మీద దృష్టి పెట్టాను. నా సినిమాలు, సీరియల్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను” అంటూ వీజే సన్నీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 నడుస్తున్న విషయం తెలిసిందే. వీజే సన్నీ వ్యాఖ్యలపై సపోర్ట్ చేస్తున్న వాళ్లు.. విమర్శిస్తున్న వాళ్లు ఇద్దరూ ఉన్నారు. సన్నీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by VJ Sunny (@iamvjsunny) View this post on Instagram A post shared by ZEE5 Telugu (@zee5telugu) View this post on Instagram A post shared by ZEE5 Telugu (@zee5telugu) ఇదీ చదవండి: హౌస్‌లో నాకంటే వరస్ట్ సభ్యులు ఉన్నారు.. రేవంత్- ఇనయా కనిపించలేదా?: గీతూ ఇదీ చదవండి: శ్రీహాన్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు.. అమ్మాయి కాస్త క్లోజ్ అయినా నామినేట్ చేస్తాడు: ఇనయా ఇదీ చదవండి: గేమ్ స్ట్రాటజీ పేరుతో గీతూ రాయల్ రచ్చ.. లోపల చెయ్యి పెట్టినా..!