Nellore: ఈ సృష్టిలో అత్యంత తియ్యనైనది ఏదైనా ఉందంటే అది కచ్చితంగా ‘మాతృత్వమే’. ఆ తీపి కేవలం బిడ్డలకు జన్మనిచ్చే తల్లులకు మాత్రమే తెలుస్తుంది. తొమ్మిది నెలలు కడుపులో మోసి పిల్లలకు జన్మనివ్వటమే కాదు. తన జీవిత అంతం వరకు ఆ పిల్లల కోసం పరితపిస్తుంది తల్లి. ఎన్ని కష్టాలనైనా.. కన్నీళ్లనైనా అవలీలగా భరిస్తుంది. కానీ, ఆ బిడ్డకు కన్నీళ్లు వస్తే మాత్రం తట్టుకోలేదు. విలవిల్లాడిపోతుంది. ‘‘ భగవంతుడా! నా బిడ్డలకు ఇచ్చే బాధలు, కష్టాలన్నీ నాకివ్వు.. నా సుఖాలన్నీ వాళ్లకు ఇవ్వు’’ అని దేవుడ్ని ప్రార్థిస్తుంది. అచ్చం నెల్లూరుకు చెందిన సుప్రజ అనే మహిళలాగా. తన బిడ్డ ప్రాణాంతకమైన రోగంతో బాధపడుతుంటే ఆ తల్లి నరక వేదనను అనుభవిస్తోంది. తన బిడ్డ ఆరోగ్యం కోసం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆమెది. వచ్చిన కష్టానికి కన్నీళ్లు కాలం వెళ్లదీస్తోంది. ప్రతీ నిత్యం కంటికి కనిపించని శత్రువుతో.. బయటకి కనిపించని యుద్ధం చేస్తోంది. చిన్నప్పుడు అందరిలాగే సుప్రజ బిడ్డ కూడా ఆరోగ్యంగా పుట్టాడు. కానీ, పెరిగే కొద్దీ.. బోర్లా పడటం, తల నిలబెట్టడం, నడవటం వంటివి ఏవీ చేయలేదు. దీంతో సుప్రజకు అనుమానం వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళితే.. బ్రేయిన్‌లో బాబుకు సమస్య ఉందని చెప్పారు. ఆ మాటలు విని ఆమె గుండె ఆగినంత పనైంది. బోసి నవ్వులు చిందిస్తున్న నా బిడ్డకు బ్రేయిన్ వ్యాధి రావటం ఏంటి దేవుడా అనుకుంది. ‘ లాభం లేదు. ఆసలు వదులేసుకోండి!’ అని డాక్టర్లు చెప్పినా.. కన్న పేగు బిడ్డ మీద ఆశలు వదల్లేదు. సంవత్సరాలు గడుస్తున్నా బిడ్డను తన ఒళ్లో మోస్తోంది. ప్రతీ రోజూ మృత్యువుతో పోరాడుతున్న బిడ్డను రక్షించుకోవటానికి ఆహర్నిశలు శ్రమిస్తోంది. 17 ఏళ్లుగా తన బిడ్డను చంటి పాపలా ఒళ్లో పెట్టుకుని సాకుతోంది. చాలీచాలని సంపాదనతో బిడ్డకు వైద్యం చేయించలేక. ఇళ్లు నెట్టుకురాలేక ఓ పోరాటమే చేస్తోంది. ఎన్ని కష్టాలు ఎదురైనా బిడ్డను మాత్రం అశ్రద్ధ చేయలేదు. భర్త ఆసరా లేకపోయినా ఒంటరిగా ఇంటిని నడిపిస్తోంది. తన కడుపులో కణితి ఉన్నా.. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా.. ‘‘ నేను ఆపరేషన్ చేయించుకుని బెడ్ మీద ఉంటే.. నా బిడ్డ పరిస్థితి ఏంటి?’’ అని ప్రశ్నిస్తోంది ఆ తల్లి హృదయం. ఇక, తన బిడ్డను మరింత బాగా చూసుకోవటానికి అవకాశం కల్పించమని ప్రార్థిస్తోంది. సహాయం కోసం ఎదురు చూస్తోంది. ఇంట్లో లేడీస్ టైలరింగ్‌కు అవసరమైన మెటీరియల్ షాపు పెట్టుకుంటానని, తగిన సాయం చేయమని అడుగుతోంది. సుప్రజ కన్నీటి గాథ మీ మనసుల్ని కదిలించినట్లుయితే.. ఆమెకు బాసటగా నిలవాలనుకుంటున్నట్లయితే వీలైనంత ఆర్థిక సాయం చేయండి. ఓ తల్లికి అండగా నిలవండి. ఆర్థిక సాయం చేయదలచిన వారు.. 86394 99198( సుప్రజ మోడేగుంట)కు ఫోన్ పే (లేదా)గూగుల్ పే చేయండి. ఇవి కూడా చదవండి : Nellore: బ్రేకింగ్ : ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా విద్యుత్ షాక్.. యువకుడి మృతి!