ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 57 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకుంది. రూ.1.26 లక్షల కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 8 వతరగతి విద్యార్ధులకు ట్యాబ్ లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. సచివాలయంలోని 85 కొత్త పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 15 తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశంలో ఎలాంటి బిల్లులు పెట్టాలి అనే అంశాలపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో కసరత్తు జరిగింది. ఏపీ ఛారిటబుల్, హిందూ మత సంస్థలకు సంబంధించిన బిల్లును సవరణ చేయబోతున్నారు. ఈ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అల్లూరి సీతారామ రాజు మన్యం జిల్లాలోని చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోద ముద్రవేసింది. గ్రీన్ ఎన్జీరీలో రూ.81 వేల కోట్ల పెట్టుబడుల ప్రాజెక్టులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 21 వేల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు కూడా కేబినెట్ ఆమోద ముద్రవేసింది. వైఎస్సార్ చేయూత, దివ్యాంగులకు 4 శాతం ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు, భావనపాడు పోర్టు విస్తరణకు జగన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. మరి.. ఏపీ కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపిన అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.