ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు ఎంత దిగజారిపోతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. కొందరు అమ్మానాన్నల కంటే ఆస్తిపాస్తులే ఎక్కువనుకి బతుకుతున్నారు. తోబుట్టువుల కంటే నోట్ల కట్టలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కోట్లు సంపాదించి పెట్టినా పిడికెడు అన్నం పెట్టేందుకు చేతులురాని కొడుకులు, కూతుర్లు ఎందరో. కానీ, తల్లిదండ్రులపై మమకారం, ప్రేమ ఉన్న కొడుకులు.. ఇంకా ఉన్నారని నిరూపిస్తున్న ఓ వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి పేరు దుర్గయ్య.. ప్రకాశం జిల్లాకు చెందినవాడు. గతంలో వ్యాపారాలు చేసుకుంటూ బాగా బతికిన వ్యక్తి. విధి అతడిని వెక్కిరించింది. చేసే ప్రతి పని, వ్యాపారంలో అన్నింట నష్టాలే. పందుల ఫారం పెడితే అమ్మే సమయానికి 90 శాతం చనిపోయాయి. నాటుకోళ్లు పెంచితే అవీ చనిపోయి నష్టాలు వచ్చాయి. 4 ఆటోలు కొంటే అందులోనూ అదే ఫలితం. సరే అని వడ్డీ వ్యాపారం చేస్తే అక్కడ కూడా మొండిచేయే ఎదురైంది. చివరికి కట్టుకున్న భార్య కూడా వదిలేసి వెళ్లిపోయింది. తల్లికి కనిపించదు, వినిపించదు, తినడానికి పళ్లు కూడా లేవు. మొదట ఆమెను తండ్రే చూసుకున్నాడు. కొన్నేళ్ల క్రితమే తండ్రి కాలం చేశాడు. అప్పటి నుంచి తల్లి బాధ్యత తానే తీసుకున్నాడు. మళ్లీ పెళ్లి కూడా చేసుకోలేదు. ఉండటానికి ఇల్లులేకపోతే రిక్షా బండినే ఇల్లుగా మార్చుకున్నాడు. తల్లికి వచ్చే పింఛను డబ్బుతో అదే రిక్షాలో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఇతడిని చూసిన వారంతా కోట్ల కన్నా ఇలాంటి కొడుకు ఒక్కడు ఉంటే చాలంటూ ప్రశంసిస్తున్నారు. తల్లికి అన్నీ తానై జీవిస్తున్న దుర్గయ్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: నా భర్త స్నేహితుడిని ఇష్టపడ్డాను.. కానీ ఆ రోజు జరిగింది ఏంటంటే? ఇదీ చదవండి: ఫ్రెండ్షిప్ డే రోజు విమానంలో రోజాకు ఊహించని గిఫ్ట్.. వైరలవుతోన్న పోస్ట్!