షార్ట్స్ వీడియోలు, రీల్స్ ద్వారా చాలా మంది మంచి ఆదాయం పొందుతున్నారు.
అయితే ఇప్పటి వరకూ పరోక్షంగా షార్ట్ వీడియోల ద్వారా యూట్యూబ్ లో ఆదాయం పొందిన వాళ్ళు.. ఇక నుంచి డైరెక్ట్ గా ఆదాయం పొందవచ్చు.
యూట్యూబ్ ఇప్పుడు షార్ట్ వీడియోలకు కూడా డబ్బులు ఇవ్వనుంది.
యూట్యూబ్ లో అప్ లోడ్ చేసే షార్ట్ వీడియోలకు నిబంధనలకు అనుగుణంగా అర్హతలు కలిగి ఉంటే మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది.
మానిటైజేషన్ ఎనేబుల్ అయితే వీడియోల మధ్యలో ప్రకటనలు వస్తాయి.
ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయంలో 45 శాతం వాటా క్రియేటర్స్ కు ఇవ్వాలని యూట్యూబ్ నిర్ణయించుకుంది.
అయితే ఈ షార్ట్ వీడియో కంటెంట్ కేవలం.. ఒరిజినల్ అయి ఉండాలి.
వేరే ఛానల్ నుంచి తీసుకొచ్చి తిరిగి అప్ లోడ్ చేయడం గానీ, మూవీ క్లిప్ లు ఉన్నదున్నట్లు అప్ లోడ్ చేయడం గానీ వంటివి చేస్తే.. మానిటైజేషన్ కి అర్హత ఉండదు.
కాపీ రైట్ కంటెంట్ అయి ఉండకూడదు. అప్పుడే మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది.
ఇక షార్ట్ వీడియోల రెవెన్యూ వేరు, లాంగ్ లెంత్ ఉన్న వీడియోలకు వచ్చే ఆదాయం వేరు.
ఫిబ్రవరి 1 నుంచి యూట్యూబ్ షార్ట్స్ కి మానిటైజేషన్ అనేది అందుబాటులో ఉంటుంది.
ఫిబ్రవరి 1 తర్వాత మానిటైజేషన్ మాడ్యూల్ ని అంగీకరించిన రోజు నుంచి అప్ లోడ్ చేసిన షార్ట్స్ కి వచ్చిన వ్యూస్ బట్టి ఆదాయం వస్తుంది.
కానీ అంతకు ముందు వీడియోలకు మాత్రం ఆదాయం రాదు.