ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కలలు కనే యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం శుభవార్త చెప్పింది.
వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, న్యాయస్థానాలు వంటి వాటిలో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకై స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
గ్రూప్ బి పోస్టులు: ఇండియన్ ఆడిట్ & అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది.
గ్రూప్ బి పోస్టులు: సెంట్రల్ సెక్రటేరియట్, ఇంటిలిజెన్స్ బ్యూరో వంటి వాటిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అసిస్టెంట్, ఇన్స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్), ఇన్స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్) వంటి పోస్టులను భర్తీ చేయనుంది.
గ్రూప్ బి పోస్టులు: ఇతర మంత్రిత్వ శాఖలు, డిపార్టుమెంట్లు, ప్రభుత్వ సంస్థల్లో అసిస్టెంట్/అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్ వంటి పోస్టులను భర్తీ చేయనుంది.
గ్రూప్ సి పోస్టులు: పలు ప్రభుత్వ ఆఫీసులు, ఇతర మంత్రిత్వ శాఖల్లో ఆడిటర్, అకౌంటెంట్, అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనుంది.
గ్రూప్ సి పోస్టులు: పోస్టల్ శాఖ, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వంటి వాటిలో పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/అప్పర్ డివిజన్ క్లర్క్స్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ వంటి పోస్టులను భర్తీ చేయనుంది.
వయసు పరిమితి: ఆయా పోస్టులు, విభాగాలను బట్టి 18 నుంచి 27, 18 నుంచి 30, 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
విద్యార్హతలు: కనీస అర్హత బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ. 100
మహిళలకు/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్ సర్వీస్ మెన్ లకు: రూ. 0/-
దరఖాస్తు చివరి తేదీ: 03/05/2023
ఎంపిక: టైర్ 1, టైర్ 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
టైర్ 1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: జూలై 2023
టైర్ 2 కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: తర్వాత నోటిఫికేషన్ ఇస్తారు