ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలంటే కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ కాలేజీలే దిక్కు అని తల్లిదండ్రులు భావిస్తున్నారు.

అయితే ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువు చెప్పించాలంటే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు.

మరి ప్రైవేట్ విద్యాసంస్థల్లో పిల్లల్ని చదివించడం ఎలా అని ఆలోచించే తల్లిదండ్రుల కోసమే ఈ పీఎం యశస్వి స్కాలర్ షిప్ పథకం.

ఈ పథకం కింద చదువుకోవాలని కలలు కనే ప్రతిభ గల విద్యార్థులకు లక్షన్నర వరకూ స్కాలర్ షిప్ అందించనున్నారు.

పీఎం యశస్వి స్కాలర్ షిప్ పథకం కింద తొమ్మిది, పదోతరగతి, ఇంటర్ చదివే విద్యార్థులకు రూ. 75 వేల నుంచి రూ. 1.50 లక్షల స్కాలర్ షిప్ అందిస్తోంది.

ఈ పథకం కింద గ్రామంలోని రైతులు, నిరుపేదలు, అణగారిన కుటుంబాలకు చెందిన వారి పిల్లలకు స్కాలర్ షిప్ లను అందిస్తున్నారు.

స్కాలర్ షిప్ తో పాటు విద్యార్థులకు అయ్యే హాస్టల్ ఫీజులు కూడా ప్రభుత్వమే భరించనుంది.

ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఈ పీఎం యశస్వి పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.

అయితే ఈ పీఎం యశస్వి స్కాలర్ షిప్ పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి.

విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రెండున్నర లక్షల లోపు ఉండాలి.

స్కాలర్ షిప్ పొందగోరే విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది.

ఈ ప్రవేశ పరీక్షలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అర్హులుగా పరిగణించి స్కాలర్ షిప్ ఇవ్వడం జరుగుతుంది.