ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు సరైన సమయం.

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తమ కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్ ఇస్తుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఓలా ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ వేరియంట్లలో లభిస్తుంది.

ఓలా ఎస్1 ప్రో మోడల్ పై రూ. 7 వేలు నుంచి రూ. 10 వేల వరకూ డిస్కౌంట్ ఇస్తోంది.

మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో రూ. 10 వేల వరకూ తగ్గింపు ఉండగా.. ఏపీ, తెలంగాణలో రూ. 7 వేల డిస్కౌంట్ లభిస్తుంది.

ఇదే మోడల్ ను మీ పాత వాహనం ఎక్స్ ఛేంజ్ చేసి కొంటే అదనంగా రూ. 10 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది.

పెట్రోల్ లేదా ఎలక్ట్రిక్ వాహనం ఏదైనా గానీ ఎక్స్ ఛేంజ్ చేయవచ్చు.

ఈ వాహనాన్ని కొనమని ఒకరికి రిఫర్ చేస్తే గనుక రూ. 1500 వరకూ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ముగ్గురికి రిఫర్ చేస్తే.. రూ. 4500 వరకూ క్యాష్ బ్యాక్ వస్తుంది.

ఒకవేళ ఈఎంఐలో కొంటే గనుక గరిష్టంగా రూ. 5 వేల తగ్గింపు లభిస్తుంది.

రూ. 25 వేల డిస్కౌంట్ ఇచ్చే మోడల్ ఒకటి ఉంది. ఓలా ఎస్1 ప్రో ఖాకీ. రిపబ్లిక్ డే సందర్భంగా దీని మీద డైరెక్ట్ గా రూ. 15 వేల వరకూ డిస్కౌంట్ వస్తుంది.

దీంతో పాటు మీ పాత వాహనాన్ని ఎక్స్ ఛేంజ్ చేసి.. ఓలా ఎస్1 ప్రో ఖాకీ మోడల్ ను కొంటే గనుక అదనంగా రూ. 10 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది.

మొత్తం రూ. 25 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది.