మీరు బీటెక్ పూర్తి చేశారా? అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో రూ. 56 వేల జీతంతో మీ కోసం ఒక ఉద్యోగం ఎదురుచూస్తుంది.

ముంబై కేంద్రంగా పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఈ పోస్టుల భర్తీకి ఎన్పీసీఐఎల్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది.

ఎగ్జిక్యూటివ్ పోస్టులు మొత్తం: 325

విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్: 123 కెమికల్: 50 ఎలక్ట్రికల్: 57

ఎలక్ట్రానిక్స్: 25  ఇన్స్ట్రుమెంటేషన్: 25  సివిల్: 45

అర్హతలు: బీఈ/బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ చేసి ఎంటెక్ చేసి ఉండాలి. .

బీటెక్, బీఎస్సీ, ఎంటెక్ లలో కనీసం 60 శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలి

గేట్-2021 లేదా గేట్-2022 లేదా గేట్-2023 పరీక్ష పాసై ఉండాలి.

అభ్యర్థుల ఎంపిక: గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే ఉద్యోగం ఇస్తారు.

ట్రైనింగ్ లో స్టైపెండ్ గా నెలకు రూ. 55,000/- ఇస్తారు. అలవెన్సులు రూ. 18 వేలు, అకామిడేషన్ కంపెనీనే భరిస్తుంది.

ట్రైనింగ్ పూర్తయ్యాక ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నుంచి సైంటిఫిక్ ఆఫీసర్ గా నియమిస్తారు. సైంటిఫిక్ ఆఫీసర్ కు నెలకు రూ. 56,100/- జీతం చెల్లిస్తారు.

రవాణా అలవెన్సులు, హౌజ్ రెంట్ అలవెన్సు లేదా లీజ్డ్ అకామిడేషన్ సదుపాయం లేదా హౌజింగ్

సైట్ లొకేషన్ అలవెన్స్, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్సు వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

దరఖాస్తు చివరి తేదీ: 28/04/2023 సాయంత్రం 4 గంటల వరకూ

దరఖాస్తు ఫీజు చెల్లింపునకు ఆఖరు తేదీ: 28/04/2023 వరకూ