మీరు బీటెక్ పూర్తి చేశారా? అయితే ఈ సువర్ణావకాశం మీ కోసమే. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో రూ. 56 వేల జీతం ఇచ్చే ఉద్యోగం మీ కోసం ఎదురుచూస్తుంది. ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి.
బీటెక్ పూర్తి చేశారా? అయితే మీకు శుభవార్త. బీటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేసే అవకాశం. ఎంపికైతే నెలకు రూ. 56 వేల జీతం ఇస్తారు. ముంబై కేంద్రంగా పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) తాజాగా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించింది. మరి దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు? ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఇతర వివరాలు మీ కోసం.