ఇండియా పోస్ట్ లో పలు ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ పడింది.
ఎం.వీ. మెకానిక్, ఎం.వీ. ఎలక్ట్రీషియన్, కాపర్ &టిన్స్మిత్, అప్ హోల్స్టర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
8వ తరగతి ఉత్తీర్ణులైన వారు లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్ లో సంబంధిత ట్రేడ్ లో సర్టిఫికెట్ కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 07 ఎం.వీ. మెకానిక్ (స్కిల్డ్): 04 ఎం.వీ. ఎలక్ట్రీషియన్ స్కిల్డ్): 01
కాపర్ & టిన్స్మిత్ (స్కిల్డ్): 01 అప్ హోల్స్టర్(స్కిల్డ్): 01
జీతం: రూ. 19,900 నుంచి రూ. 63,200/- వరకూ + అలవెన్సులు
వయసు పరిమితి: యూఆర్ & ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: 01/07/2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలి.
ప్రభుత్వ ఉద్యోగులకు: 40 ఏళ్ల లోపు ఉండాలి.
వయసు సడలింపు: ఎస్సీ వాళ్లకి 05 ఏళ్లు, ఓబీసీ వాళ్లకి 03 ఏళ్లు
అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లో ఎం.వీ. మెకానిక్, ఎం.వీ. ఎలక్ట్రీషియన్, కాపర్ & టిన్స్మిత్, అప్ హోల్స్టర్ ట్రేడ్స్ లో ఏదో ఒక ట్రేడ్ లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
లేదా ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ లో ఏడాది పాటు అనుభవం కలిగి ఉండాలి.
ఎం.వీ. మెకానిక్ పోస్టుకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులైతే ఖచ్చితంగా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్ లైన్ లో చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/మహిళా ఉద్యోగులకు: దరఖాస్తు ఫీజు లేదు
మిగతా అభ్యర్థులకు: రూ. 100/- దరఖాస్తుకి ఆఖరు తేదీ: 09/01/2023 సాయంత్రం 5 గంటల వరకూ