డిగ్రీ పూర్తి చేశారా? ఐతే మీ కోసమే ఈ సువర్ణావకాశం.

హెచ్డీఎఫ్సీ బ్యాంకు వారే మీకు కోర్సు నేర్పించి ట్రైనింగ్ లో స్టైపెండ్ కింద కొంత అమౌంట్ ఇస్తారు.

ట్రైనింగ్ పూర్తయ్యాక అర్హులైతే జాబ్ కూడా ఇస్తుంది.

ఫ్యూచర్ బ్యాంకర్స్ 2.O పేరుతో ప్రత్యేక రిక్రూట్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టింది హెచ్డీఎఫ్సీ బ్యాంకు.

మణిపాల్ గ్లోబల్ అకాడమీ బీఎఫ్ఎస్ తో కలిసి నియామకాలు చేపడుతోంది.

దీని కోసం ఏడాది పాటు ప్రొఫెషనల్ డిప్లోమా కోర్సుని ప్రవేశపెట్టింది.

ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ఏడాదికి రూ. 5.59 లక్షల జీతం పొందే అవకాశం కల్పిస్తుంది.

కోర్సు ఫీజు కోసం ఎడ్యుకేషన్ లోన్ బ్యాంకే ఇస్తుంది.

ఈ లోన్ ని 12 నెలల వరకూ కట్టాల్సిన పని లేదు.

కోర్సు పీరియడ్ 12 నెలలు. ఇందులో  4 నెలల పాటు క్లాసెస్ ఉంటాయి.

2 నెలలు ఇంటర్న్ షిప్, 6 నెలలు ఏదైనా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శాఖలో జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.

కోర్సు దశలో మొదటి 4 నెలలు నెలకు రూ. 5 వేల చొప్పున స్టైపెండ్ ఉంటుంది.

ఇంటర్న్ షిప్ దశలో రెండు నెలల పాటు నెలకు రూ. 10 వేల చొప్పున స్టైపెండ్ ఇస్తారు.

జాబ్ ట్రైనింగ్ దశలో 6 నెలల పాటు నెలకు రూ. 24 వేల నుంచి రూ. 26 వేల స్టైపెండ్ ఇస్తారు.