హైదరాబాద్ సిటీకి 20, 30 కి.మీ. దూరంలో ఉన్న ఏరియాల్లో మీరు తక్కువ బడ్జెట్ లో సొంతింటి కలను నిజం చేసుకోవచ్చు.
ఉదాహరణకు పటాన్ చెరువు తీసుకుంటే.. ఈ ఏరియాలో చదరపు అడుగుకి రూ. 3,100 అవుతుంది.
2 బీహెచ్కే కట్టుకోవాలంటే కనీసం 30 లక్షలు అవుతుంది.
అయితే మీరు ఒక్కరే స్థలానికి పెట్టుబడి పెట్టకుండా మీతో పాటు ఒక ముగ్గురిని భాగస్వామ్యం చేసుకుంటే మీకు 9 లక్షలే పడుతుంది స్థలం మీద.
40 లక్షల స్థలం అనుకున్నా గానీ మీ వాటా 10 లక్షలే అవుతుంది.
మనిషి 10 లక్షల చొప్పున లోన్ పెట్టుకుని స్థలం కొనుక్కుంటే.. ఆ తర్వాత నెమ్మదిగా ఇల్లు కట్టుకోవచ్చు.
స్థలం అయిపోయింది. ఇక ఇల్లు మిగిలింది.
ఇంటి నిర్మాణానికి ఒక్కొక్కరికీ 20 లక్షలు అవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ కి వదిలేసి నాలుగు ఫ్లోర్లు నిర్మించుకుంటే 60, 80 లక్షల్లో 4 అంతస్తుల ఇల్లు పూర్తయిపోతుంది.
దీని వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంటంటే.. ఇండివిడ్యువల్ హౌజ్ లో ఉన్నట్టు ఉంటుంది.
అపార్ట్మెంట్ లో ఎన్నో ఫ్లాట్లు ఉంటాయి. పక్కన గోల.
అదే ఈ ఐడియా ఫాలో అయితే ఎటువంటి గోల ఉండదు. మీకు నచ్చిన వ్యక్తులతో కలిసి ఉండవచ్చు.