దీని వల్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది. కొన్ని సార్లు ఓవర్ హీట్ కూడా అవుతుంది.
ఓవర్ హీట్ కి గురైతే.. ల్యాప్ టాప్ లు, కంప్యూటర్స్ యొక్క సామర్థ్యం దెబ్బ తింటుంది.
దీని వల్ల ల్యాప్ టాప్, కంప్యూటర్ల లోపల సర్క్యూట్లు కాలిపోతాయి.
కూలింగ్ ఫ్యాన్లు, కూలింగ్ ప్యాడ్లు, హీట్ సింక్ వంటివి ఉన్నా హీట్ ని తగ్గిస్తాయి. కానీ ఓవర్ హీట్ ని తగ్గించలేవు.
ఈ కారణంగా ల్యాప్ టాప్ లు త్వరగా పాడైపోతున్నాయి. ఇందుకు పరిష్కారంగా అమెరికా స్టార్టప్ కంపెనీ ఒక సొల్యూషన్ కనిపెట్టింది.
ఎయిర్ జెట్ చిప్ అనే సరికొత్త పరికరాన్ని కనుగొంది.
ప్రాసెసర్ చిప్ లా ఉండే ఈ ఎయిర్ జెట్ పరికరం ల్యాప్ టాప్, కంప్యూటర్లలో ఉండే మైక్రో ప్రాసెసర్ ను ఓవర్ హీట్ కాకుండా చల్లదనాన్ని ఇస్తుంది.
ఫ్రోర్ సిస్టమ్స్ అనే అమెరికన్ సంస్థ ఈ పరికరాలను అందుబాటులోకి తీసుకురానుంది.
ఇప్పటికే ఇంటెల్, క్వాల్ కమ్ వంటి దిగ్గజ ప్రాసెసర్ తయారీ కంపెనీలు ఫ్రోర్ సిస్టమ్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ ఎయిర్ జెట్ చిప్ లను అందుబాటులోకి తీసుకురానున్నారు.