పసిడి ప్రియులకు నిజంగా ఇది మంచి వార్త అని చెప్పవచ్చు.
నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర ఇవాళ భారీగా తగ్గింది. 5 రెట్లు పైగా తగ్గింది.
గడిచిన 10 రోజుల్లో బంగారం ధరలు పడిపోతూ వస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం పతనమవుతుండడంతో బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ ఒక ఔన్సు వచ్చి 1828.84 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 0.38 శాతం మేర పడిపోయింది.
ఔన్సు వెండి ధర 21.47 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 0.76 శాతం మేర పడిపోయింది.
ఈరోజు ట్రేడ్ ముగిసే సమయానికి ఇంకా తగ్గే అవకాశం కనిపిస్తుంది.
22 క్యారెట్ల గోల్డ్ ధర ఒక గ్రాము రూ. 5,200 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 52,000 గా ఉంది.
నిన్న ఇదే 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 5,240 గా ఉంటే ఇవాళ ఏకంగా రూ. 400 తగ్గింది.
దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. ఇవాళ రూ. 52,400 వద్ద కొనసాగుతోంది.
ఇక 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము వద్ద రూ. 5,673గా ఉంటే.. 10 గ్రాముల వద్ద రూ. 56,730 గా ఉంది.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, వైజాగ్ నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక కిలో వెండి ధర నిన్న రూ. 72 వేలు ఉండగా ఇవాళ రూ. 200 తగ్గింది. దీంతో ఇవాళ కిలో వెండి ధర రూ. 71,800 వద్ద కొనసాగుతోంది.
ఈ ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.