కొన్ని రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి , తమ రంగంలో సేవలు అందించినందుకు గాను అవార్డులు ఇస్తుంటారు.

ఈ అవార్డులకు స్పాన్సర్ గా కొన్ని ప్రముఖ సంస్థలు ఉంటాయి.

అంటే అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని కొన్ని కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి.

ఈ క్రమంలో అదానీ గ్రూప్ కూడా ఒక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి స్పాన్సర్ గా ఉంది.

అయితే అదానీ గ్రూప్ స్పాన్సర్ గా ఉన్న అవార్డు కార్యక్రమానికి రానని, ఆ అవార్డు అవసరం లేదని ఒక మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది.

హిండెన్ బర్గ్ రీసెర్చ్ కారణంగా అదానీ గ్రూప్ ఘోర విమర్శలు ఎదుర్కొంటుంది.

స్టాక్ మ్యానిప్యులేషన్ కి పాల్పడిందని వస్తున్న విమర్శల నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ కవయిత్రి కీలక ప్రకటన చేశారు.

సాహిత్య రంగంలో దళిత సాహిత్య రచనలతో సేవలను అందించినందుకు గాను తమిళ కవయిత్రి సుకీర్తరాణికి దేవి అవార్డు ప్రధానం చేయాలని ఆంగ్ల పత్రిక ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్’ నిర్ణయించింది. 

వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన, సేవలు అందించిన 12 మంది మహిళల్లో ఈమెను ఒకరిగా ఎంపిక చేసింది.

అయితే అదానీ గ్రూప్ స్పాన్సర్ చేస్తున్న విషయం తెలిసిన వెంటనే.. ఆమె ఈ అవార్డును తిరస్కరించారు.

ఈ అవార్డును తీసుకోవడం తన సిద్ధాంతాలకు వ్యతిరేకమని అన్నారు.

ఈమె కవయిత్రి మాత్రమే కాదు, సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయురాలు కూడా.

దళిత సాహిత్యంపై ఎన్నో రచనలు చేసి గుర్తింపు పొందారు.