దిగ్గజ టాటా స్టీల్ కంపెనీలో ఇంజనీర్ ట్రైనీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది.

శిక్షణ ఇచ్చి జాబ్ లో జాయిన్ చేసుకుని నెలకు రూ. 52 వేల జీతం ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటనలో పేర్కొంది.

ట్రైనింగ్ పీరియడ్ లో నెలకు రూ. 30 వేలు స్టైపెండ్ ఇస్తారు.

ట్రైనీకి ఏడాదికి రూ. 2,50,000 హాస్పిటలైజేషన్ కవరేజ్ ఉంటుంది. అలానే ఓపీడీ కవరేజ్ రూ. 6 వేలు ఉంటుంది.  

శిక్షణ పూర్తయ్యాక పర్మినెంట్ ఉద్యోగం ఇస్తారు. 3 ఏళ్ల పాటు అసిస్టెంట్ మేనేజర్ గా నియమిస్తారు.

అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి ఏడాదికి రూ. 6.24 లక్షలు జీతం చెల్లిస్తారు. జీతంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు ఉంటాయి.

వయసు పరిమితి: ఫిబ్రవరి 01 2023 నాటికి 30 ఏళ్లు మించకూడదు. 

అర్హతలు: కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగాల్లో బీఈ/బీటెక్ పాసై ఉండాలి. లేదా ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండాలి.    

డిప్లోమా పూర్తి చేసి ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో జాయిన్ అయినవారు కూడా అర్హులే.

డిప్లోమా తర్వాత ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

జనరల్ అభ్యర్థులకు 65 శాతం, ట్రాన్స్ జెండర్లు, పీడబ్ల్యూడీ, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 60 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.  

ఎంపిక విధానం: ఆన్ లైన్ లో కాగ్నిటివ్ మరియు టెక్నికల్ టెస్టులు ఉంటాయి.. 

టెస్టులో పాసైతే షార్ట్ లిస్ట్ చేసి డైరెక్ట్ ఇంటర్వ్యూకి పిలవడమో లేదా ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ చేయడమో జరుగుతుంది. 

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ లో చేసుకోవాలి.   

దరఖాస్తు చివరి తేదీ: 03/03/2023