ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేల పోస్టుల భర్తీకి నోటఫికేషన్ విడుదల చేయనుంది.
20 విభాగాల్లో 14,523 పోస్టులను భర్తీ చేయనుంది.
ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి.. ఏప్రిల్ నెలలో ఖాళీల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.
మూడు నెలల్లోగా ఉద్యోగాల నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సహా మొత్తం 20 విభాగాల్లో 14,523 ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
వయసు పరిమితి: 18 నుంచి 42 ఏళ్ల లోపు ఉండాలి.
వయసు సడలింపు: కేటగిరీలను బట్టి ఉంటుంది.
జీతం: పోస్టును బట్టి రూ. 14,600/- నుంచి రూ. 44,870/- వరకూ ఉండచ్చు
దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ. 400/- ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్: రూ. 200/-
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.