పెట్రోల్ వాహనాల పట్ల విసిగిపోయి ఉన్నారా? విద్యుత్ వాహనాన్ని కొనాలని అనుకుంటున్నారా?
సంక్రాంతి సీజన్ కాబట్టి డిస్కౌంట్ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉంటే బాగుణ్ణు అని అనుకుంటున్నారా?
అయితే మీ కోసమే ఈ వాహనం. కోమకి కంపెనీ ఎలక్ట్రిక్ మోడల్స్ పై డిస్కౌంట్లు ప్రకటించింది.
కోమకి వెనిస్ ఎకో మోడల్ పై రూ. 18 వేల రూపాయలను తగ్గింపు ఆఫర్ ఉంది.
దీని అసలు ధర రూ. 94,800/- కాగా.. 18 వేల డిస్కౌంట్ తో కేవలం రూ. 77 వేలకే ఈ విద్యుత్ వాహనం లభిస్తుంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 నుంచి 100 కి.మీ. రేంజ్ ఇస్తుంది.
బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది.
బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేయడానికి అయ్యే విద్యుత్ వినియోగం 2 యూనిట్లు.
అంటే 80 నుంచి 100 కి.మీ. ప్రయాణానికి అయ్యే ఖర్చు కేవలం రూ. 12 మాత్రమే.
ఎలక్ట్రిక్ వాహనాలు పేలిపోతున్నాయని భయం పడే అవకాశం లేకుండా ఫైర్ రెసిస్టెన్స్ ఫెసిలిటీతో బ్యాటరీని డిజైన్ చేశారు.
బ్యాక్ రెస్ట్, ముందు భాగంలో స్టోరేజ్ స్పేస్, సెల్ఫ్ డయాగ్నోసిస్ రిపేర్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.
మొత్తం ఇది 6 రంగుల్లో లభిస్తుంది. సంక్రాంతి సందర్భంగా 18 వేలు తగ్గింపుతో వస్తుంది.
ఎక్స్ షోరూం ధర రూ. 77 వేలు కాగా.. ఆన్ రోడ్ ధర వచ్చేసి రూ. 82,747 ఉంది.