ఆర్థిక మాంద్యం కారణంగా అమెజాన్, మెటా సహా పలు దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకున్నాయి.
ఇప్పటికే అమెజాన్ 18 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్లు ప్రకటించగా.. మెటా సంస్థ 11 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోలేక ఉద్యోగులను తొలగించేస్తున్న నేపథ్యంలో దిగ్గజ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ కొత్తగా ఉద్యోగులను నియమించేందుకు
లక్షా 25 వేల నుంచి లక్షా 50 వేల ఉద్యోగులను నియమించనున్న విషయాన్ని ప్రకటించింది టీసీఎస్. దీంతో టెకీలు అబ్బా సాయిరాం అనుకుంటున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి లక్షా 25 వేల నుంచి లక్షా 50 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.
గత ఏడాది డిసెంబర్ నెల ముగిసేనాటికి టీసీఎస్ 6,13,974 మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. త్రైమాసికంలో 2,197 మంది ఉద్యోగులు సంస్థ వైదొలిగారు.
గడిచిన 18 నెలల్లో టీసీఎస్ సంస్థ భారీగా నియామకాలను చేపట్టింది. ఈ క్రమంలో టీసీఎస్ సంస్థ క్యూ3 ఫలితాలను వెల్లడించింది.
ఈ సందర్భంగా.. సంస్థ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథన్ మీడియాతో నియామకాలు ఉంటాయని స్పష్టం చేశారు.
గత 18 నెలల్లో భారీగా నియామకాలు చేపట్టినా.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగుల తొలగింపు ప్రస్తావన లేదని ఆయన అన్నారు.
అనుభవం ఉన్న టెకీలతో పాటు ఫ్రెషర్స్ కి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే 5 లక్షల మందికి పైగా ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోగా.. 40 వేల మందిని నియమించుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించింది.
నియామకాల ట్రెండ్ మునుపటిలానే కొనసాగుతుందని, వచ్చే ఏడాది లక్షా 25 వేల నుంచి లక్షన్నర మందిని నియమించుకునేందుకు సంస్థ సిద్ధంగా ఉందని అన్నారు.
మరి సిద్ధంగా ఉన్నారా టెకీలు? టీసీఎస్ అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి దాని సంగతి చూడండి.