వాట్సాప్ ఇప్పుడు అందరికీ జీవనాధారం అయిపోయింది.
పలుగు, పార పట్టుకెళ్లే రైతు కూలీ నుంచి కార్పొరేట్ ఆఫీస్ లో కూర్చుని కాళ్ళు ఊపుకుంటూ పనిచేసే ఉద్యోగి వరకూ ప్రతీ ఒక్కరూ వాట్సాప్, వాట్సాప్ అంటున్నారు.
వాట్సాప్ లేకపోతే పనులవ్వని పరిస్థితి. అంతలా వాట్సాప్ తో మనుషుల వృత్తిపరమైన జీవితం పెనవేసుకుపోయింది.
వృత్తిపరంగానే కాకుండా.. ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేయడానికి.. సరదాగా చాట్ చేయడానికి.. కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్, ఆడియో కాల్స్ చేసుకోవడానికి చాలా మంది వాట్సాప్ ని వినియోగిస్తున్నారు.
వాట్సాప్ అంటే ఒక ఎమోషన్ అయిపోయింది. అలాంటి ఎమోషన్ ఇకపై కొంతమందికి దూరమయ్యే అవకాశం ఉందని వాట్సాప్ బాంబు పేల్చింది.
కొన్ని ఫోన్లలో ఐఫోన్ సిరీస్ లో ఉన్న మోడల్స్ సహా.. కొన్ని ఫోన్లలో వాట్సాప్ ఇకపై నడవదు. ఇది కంపెనీ చెప్పిన మాట.
సాఫ్ట్ వేర్ అప్ డేట్, భద్రతాపరమైన లోపాల కారణంగా 49 స్మార్ట్ ఫోన్ మోడల్స్ లో వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది.
ఎప్పటికప్పుడు అప్ డేట్స్, సరికొత్త ఫీచర్స్ ని తీసుకొచ్చే వాట్సాప్.. ఇక నుంచి కొన్ని ఫోన్లలో ఫీచర్స్, అప్ డేట్స్ ఉండవని వెల్లడించింది.
ఇకపై వాట్సాప్ వాడాలంటే ఫోన్లు మార్చుకోవడమో లేక వాట్సాప్ అన్ ఇన్స్టాల్ చేసుకోవడమో చేయడం తప్ప వేరే దారి లేదని వాట్సాప్ తెలిపింది.
వాట్సాప్ యూజర్లు ఈ కొత్త మార్పుని గమనించాలని మెటా కోరింది.
జనవరి 1 నుంచి ఐఫోన్ సిరీస్ లో వచ్చిన ఫోన్లతో సహా చాలా ఫోన్లలో వాట్సాప్ సపోర్ట్ చేయదని కంపెనీ తెలిపింది.
మొత్తం 49 స్మార్ట్ ఫోన్ మోడల్స్ కి వాట్సాప్ విడుదల చేసే కొత్త ఫీచర్లు, సెక్యూరిటీ అప్ డేట్స్ రావని తెలిపింది.
ఐఫోన్, శాంసంగ్ గెలాక్సీ, ఎల్జీ, సోనీ ఎక్స్పీరియా, హెచ్టీసీ, లెనోవా సహా పలు బ్రాండ్ల సిరీస్ లకి చెందిన కొన్ని మోడల్స్ లో వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూసే. కానీ తప్పదు. కొత్త ఫోన్ కొనుక్కోవాలి. కొత్త సంవత్సరం, కొత్త ఫోను.. అదిరిందయ్యా చంద్రం అనిపించుకోండి మరి.
డిసెంబర్ 31తోనే లాస్ట్. మీ ఫోన్లు కనుక ఈ జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోండి.