సుప్రీం కోర్టులో కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టుల కింద కోర్టు అసిస్టెంట్ (టెక్నికల్ అసిస్టెంట్ కమ్ ప్రోగ్రామర్స్) ని రిక్రూట్ చేయనున్నారు.

జీతభత్యాలు: బేసిక్ జీతం రూ. 44,900/- + ఇతర అలవెన్సులు HRAతో కలిపి స్థూల జీతం సుమారుగా నెలకు రూ. 80,803/-

వయసు పరిమితి: 18 నుంచి 30 ఏళ్లు లోపు ఉండాలి. 

వయసు సడలింపు: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మేన్ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది.

అర్హతలు: కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్/బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కోర్సు చేసి ఉండాలి.

లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్ డిగ్రీ లేదా కంప్యూటర్ సైన్స్  లో ఎం.ఎస్సీ చేసి ఉండాలి.

లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా బీసీఏ ఫస్ట్ క్లాస్ లేదా కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.  

అనుభవం: పై వాటిలో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కంప్యూటరైజేషన్ రంగంలో కనీసం ఏడాది పాటు అనుభవం ఉండాలి.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో లా పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైప్ టెక్నికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ప్రాక్టికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటాయి. టెస్టుల్లో పాసైన తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 31/12/2022

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్ లైన్ లో