భారతీయ స్టేట్ బ్యాంక్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

సెక్టార్ క్రెడిట్ స్పెషలిస్ట్ పోస్టుకి సంబంధించిన పలు పోస్టుల భర్తీ కోరుతూ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టు: సెక్టార్ క్రెడిట్ స్పెషలిస్ట్ మొత్తం పోస్టులు: 16

కేటగిరీల వారీగా సెక్టార్ క్రెడిట్ స్పెషలిస్ట్ పోస్టులు: ఎస్సీ: 02 ఎస్టీ: 01 ఓబీసీ: 04 ఈడబ్ల్యూఎస్: 01

జనరల్: 08 పీడబ్ల్యూబీడీ: (లోకో మోటార్ డిజాబిలిటీ, వన్ లెగ్ ఇంపెయిర్డ్: 01

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సీఏ లేదా ఎంబీఏ (ఫైనాన్స్) లేదా ఫైనాన్స్ కంట్రోల్ లో మాస్టర్ డిగ్రీ లేదా మాస్టర్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్ లేదా పీజీడీఎం (ఫైనాన్స్) చేసి ఉండాలి. లేదా తత్సమాన కోర్సు చేసి ఉండాలి. 

అనుభవం: 01/10/2022 నాటికి సంబంధిత విభాగంలో అనుభవం మరియు ప్రత్యేక స్కిల్స్ కలిగి ఉండాలి.

సెక్టార్ క్రెడిట్ స్పెషలిస్ట్ జీతభత్యాలు: ఎంఎంజీఎస్-III గ్రేడ్ వారికి: రూ. 63,840/- నుంచి రూ. 78,230/- వరకూ ఎస్ఎంజీఎస్-IV గ్రేడ్ వారికి: రూ. 76,010/- నుంచి రూ. 89,890/- వరకూ

డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ, పీఎఫ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్ (ఎన్పీఎస్), ఎల్ఎఫ్సీ, మెడికల్ సౌలభ్యం కూడా ఉన్నాయి. 

వయసు పరిమితి: 01/10/2022 నాటికి 25 నుంచి 35 ఏళ్ల వయసు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు

పోస్టింగ్: కార్పొరేట్ సెంటర్, ముంబై

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ లో చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: రూ. 750/- దరఖాస్తు చివరి తేదీ: 29/12/2022