చిన్న చిన్న అమౌంట్లే పోగుజేస్తే భవిష్యత్తులో లక్షలు అవుతాయని తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు.
వడ్డీ రానప్పుడు పోగుజేసినా అనవసరం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు.
అయితే మీ కుటుంబ సభ్యులకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ రూపంలో పొదుపు చేయాలి.
ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ రూపంలో పొదుపు చేస్తే వడ్డీ కూడా కలిసి వస్తుంది.
ఎల్ఐసీ పాలసీలో నెలకు 2 వేలు పొదుపు చేస్తూ.. మెచ్యూరిటీ సమయంలో 48 లక్షలు పొందవచ్చు.
ఈ పాలసీలో ఎల్ఐసీ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజెబిలిటీ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, ఎల్ఐసీ యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ ప్రీమియం వీవర్ బెనిఫిట్ రైడర్ వంటి ప్లాన్ లు అందుబాటులో ఉన్నాయి.
ఈ ప్లాన్స్ లో ఏదో ఒక దాంట్లో చేరవచ్చు. 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు వయసున్న వ్యక్తులు ఎవరైనా చేరవచ్చు.
కనీసం 12 నుంచి 35 ఏళ్ల మెచ్యూరిటీ సమయం ఉండాలి.
కనిష్టంగా లక్ష రూపాయల సమ్ అష్యూరెన్స్ నుంచి గరిష్టంగా ఎంతైనా పొదుపు చేసుకోవచ్చు.
18 ఏళ్ల వయసున్న వ్యక్తి ఈ పాలసీలో 10 లక్షల సమ్ అష్యూరెన్స్ తో.. మెచ్యూరిటీ సమయం 35 ఏళ్లకి పెట్టుకుంటే ఏడాదికి 24,391 చెల్లించాలి.
నెలకు రూ. 2,079/- చొప్పున 35 సంవత్సరాల పాటు పొదుపు చేసుకుంటూ వెళ్తే.. మెచ్యూరిటీ సమయానికి 48 లక్షల పైనే వస్తాయి.